Thursday, May 2, 2024
- Advertisement -

ఉద్రిక్త‌క‌రంగా మారిన భార‌త్ బంద్‌…

- Advertisement -

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని నీరుగార్చవద్దంటూ దళిత సంఘాలు చేపట్టిన భారత్‌ బంద్‌ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ బంద్‌ హింసాత్మకంగా మారింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లో జరిగిన ‘భారత్‌ బంద్‌’ ఆందోళనలో హింస చోటుచేసుకుంది. పోలీసులతో నిరసనకారులు ఘర్షణ పడటం, పోలీసులు గాలిలోకి కాల్పులు జరపడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

మీరట్ జిల్లా శోభాపూర్ పోలీసు ఔట్ పోస్టుకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. వాహనాలను ధ్వంసం చేశారు పదుల సంఖ్యలో బస్సులను అగ్నికి ఆహుతి చేశారు. ఆగ్రాలో పోలీసులు, మీడియా సిబ్బందిపై రాళ్లదాడికి తెలిపారు. దీంతో, నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఓ పెట్రోల్ బంక్ కు నిప్పు పెట్టేందుకు యత్నించారు.

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కు 450 కిలోమీటర్ల దూరంలోని మోరెనా ప్రాంతంలో నిరసనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నిరసనకారులు ఇక్కడ రైల్వేట్రాక్‌లను తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అడ్డుకున్న పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు నిరసనకారులను నియంత్రించేందుకు ఒక దశలో గాలిలో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది.

మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాత్ మాట్లాడుతూ, శాంతియుత మార్గంలో నిరసన చేపట్టాలని ఆందోళనకారులను కోరారు. ఎస్సీ, ఎస్టీలను వేధించినట్టు ఆరోపణలను ఎదుర్కొనేవారిని తక్షణమే అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనికి నిరసనగానే దళితవర్గాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -