Thursday, May 2, 2024
- Advertisement -

రాజ‌ధాని నిర్మానం సింగ‌పూర్ చేతుల్లో ఉన్న‌ప్పుడు ఇక స్మార్ట్ సిటీ ఎందుకో….?

- Advertisement -
Central Government announces 30 smart cities

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌ సిటీస్‌ లో భాగంగా మరో 30 స్మార్ట్‌ నగరాలను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించారు. తెలంగాణానుంచి క‌రీంన‌గ‌ర్‌ను..ఏపీ నుంచి అమ‌రావ‌తిని స్మార్ట్ న‌గ‌రాలుగా ప్ర‌క‌టించారు.

ఇదంతా బాగానే ఉంది.ప్ర‌పంచ స్థాయి జ‌ధానిగా నిర్మిస్తాన‌ని చెప్పిన‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు కార్య‌చ‌ర‌ణ‌లేదు.మ‌రి ఇప్పుడు అమ‌రావ‌తిని స్మార్ట్ సిటీగా ప్ర‌క‌టించ‌డం హాస్యాస్ప‌దంగా ఉంది.

{loadmodule mod_custom,GA1}

లేని అమరావతిని కేంద్రం స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చటం విచిత్రంగా ఉంది. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ సిటీస్ మూడ‌వ జాబితాలో అమ‌రావ‌తిని ప్ర‌క‌టించారు.
విచిత్రమేమిటంటే అమరావతినగరం అన్నది ఇప్పటికైతే కేవలం ఊహల్లో మాత్రమే ఉంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే బ్రిటన్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ డిజైన్లలో మాత్రమే ఉంది. గడచిన మూడేళ్ళుగా చంద్రబాబునాయుడు అమరావతిని ప్రపంచస్దాయి రాజధానిగా నిర్మిస్తానని చెప్పటమే కానీ కార్యాచరణలోకి దిగలేదు.నిర్మానం ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుందో తెలియ‌ని పరిస్థితి.

{loadmodule mod_custom,GA2}

ఒకవేళ అమరావతి నగర నిర్మాణం ప్రారంభమైనా అందులో ప్రభుత్వం చేయటానికి కూడా ఏమీ ఉండదు. ఎందుకంటే, నగరం నిర్మాణం మొత్తాన్ని చంద్రబాబు సింగపూర్ కంపెనీల చేతుల్లో పెట్టేస్తున్నారు. అటువంటి అమరావతిని కేంద్రం స్మార్ట్ సిటీగా ప్రకటించటమేమిటో అర్ధం కావటంలేదు.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}diOzXns-jwc{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -