Sunday, April 28, 2024
- Advertisement -

జగన్ కన్నా చంద్రబాబుదే పెద్ద ఫెయిల్యూరా?!

- Advertisement -

దేశంలో రాజకీయాలు ఎన్నడూ లేనంత కమర్షియల్ గా మారిపోయినట్టుగా ఉన్నాయి. ప్రత్యేకించి మొన్నటి ఎన్నికల ముగిసిన తర్వాత పరిస్థితులను గమనిస్తే.. నేతల తీరును పరిశీలిస్తే.. రాజకీయాల్లో విలువలు మరింత పతనం అయ్యాయని స్పష్టం అవుతోంది. మరి రాజకీయాలే విలువలు లేనివి.. అందులో కొత్తగా పతనం కావడం ఏముంది?

అంటే… ఫిరాయింపు దారుల గురించి ప్రస్తావించాలి. రాజకీయాల్లో ఒక పార్టీ వారు మరో పార్టీపై దుమ్మెత్తిపోసుకోవడం.. వ్యక్తిగత విమర్శలకు దిగడం చాలా మామూలే. చట్టసభల సాక్షిగానే నేతలు ఇలా దుమ్మెత్తిపోసుకోవడం భారత ప్రజాస్వామ్యంలో ఆది నుంచి జరుగుతోంది.

మరి గతంలోనూ ఇలాంటి పరిస్థితి ఉన్నా.. కనీసం నేతలు తమ తమ పార్టీ స్టాండులకు కట్టుబడి ఉండేవారు. పార్టీలు మారడం.. అనేది ఇంత సులభంగా జరగడం మాత్రం జరిగేది కాదు. ఒక్కో కుటుంబం కొన్ని దశాబ్దాల పాటు ఒక్కో పార్టీకి కట్టుబడి ఉండేది. అయితే ఇప్పుడు రాత్రికిరాత్రి పరిస్థితులు మారిపోతున్నాయి. జెండాలు పీకేస్తున్నారు.. చొక్కాలు తిప్పేస్తున్నారు!

మరో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తెరాస బాట పట్టాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి తెరాసలో చేరడం ధ్రువీకరణ అయ్యింది. ఆయన వెళ్లి కేసీఆర్ ను కలవడంతో కథ ఒక కొలిక్కి వచ్చింది. ఇలా పార్టీ మారితే అనర్హత వేటు పడే అవకాశం ఉన్నా.. ఇప్పటి వరకూ ఇలా జంపింగ్ లు చేఇసన వారిపై అనర్హత వేటు పడకపోవడంతో కిషన్ రెడ్డి ధైర్యంగా ముందుకెళ్లాడు. 

మరి ఈయనను పార్టీ మారకుండా చూడటానికి తెలుగుదేశం వారు తీవ్రంగానే ప్రయత్నించారు. ప్రత్యేకించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి తనయుడు లోకేష్ బాబు రంగంలోకి దిగి కిషన్ రెడ్డిని పార్టీలోనే నిలుపుకోవడానికి ప్రయత్నించాడు. కిషన్ రెడ్డి కుమారుడిని పిలిపించుకొని మాట్లాడాడు. అయితే ప్రయత్నాలు ఫలించలేదు. మరి ఏపీలో అధికారంలో ఉండి.. తెలంగాణలో కూడా భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను నిలుపుకోలేకపోతోంది. ఈ రకంగా చూస్తే.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కన్నా చంద్రబాబుదే పెద్ద ఫెయిల్యూర్ అనుకోవాల్సి వస్తోంది!

జగన్ కొత్తగా పార్టీ పెట్టుకొన్నాడు.. అది ఎప్పుడు అధికారంలోకి వచ్చేనో తెలీదు. అయినా  కూడా పార్టీ నుంచి బయటకు వచ్చిన ప్రజాప్రతినిధుల సంఖ్య తక్కువే. అయితే బాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉండి కూడా.. తెలంగాణలో ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతున్నాడు. మరి బాబు అనుభవం కూడా ఇక్కడ పనికిరావడం లేదనుకోవాలా?!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -