Tuesday, May 7, 2024
- Advertisement -

పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ త‌ప్పుతోంది..ఇక ఉపేక్షించేదిలేద‌న్న బాబు

- Advertisement -
Chandrababu warns against breach of party discipline

టీడీపీ పార్టీలో జ‌రుగుతున్న  సంఘ‌ట‌న‌లు బాబుకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. క్ర‌మ‌శిక్ష‌న‌కు మారుపేరుగా నిలిచిన పార్టీలో కొంద‌రు క్ర‌మ‌శిక్ష‌న త‌ప్పుతున్నారు. ఇది ఇలానే కొన‌సాగితే భ‌విష్య‌త్తులో స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని వీట‌న్నింటికి ఇప్పుడే పుల్‌ష్టాప్ పెట్టాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

పార్టీలో ఎవ‌ర‌కు క్ర‌మ‌శిక్ష‌ణ త‌ప్పినా ఎంత‌వారిని ఉపేక్షించేదిలేద‌నే సంకేతాన్ని ఇవ్వాల‌ని బుబు నిర్న‌యంతీసుకున్న‌ట్లు తెలుస్తోంది.వరుసగా జరుగుతున్న ఘటనలు ఆ పార్టీ ఇమేజ్ ను క్రమంగా దెబ్బ తీస్తున్నాయి.

టీడీపీ నేతలే కొన్ని చోట్ల.. మరికొన్ని చోట్ల వారి పేరు చెప్పుకుని కుటుంబ సభ్యులు బంధుగణం చేస్తున్న అరాచకాలు శ్రుతిమించిపోతున్నాయి. తాజాగా ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడు టోల్ గేట్ పై దాడి చేయడం మరింతగా పరువు తీసింది. దీంతో బాబు అగ్గిమీద గుగ్గీలం అవుతున్న‌ట్లు స‌మాచారం.ఈ ఘటనలకు తోడు ఇటీవల పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలోనూ చాలా మంది నేతలు చురుగ్గా పాల్గొనలేదట. ఆ రొటీన్ ఎన్నికలేగా అని లైట్ గా తీసుకున్నారట. ఆ విషయం తెలిసి అసలే కోపంతో ఉన్న చంద్రబాబు పార్టీ నేతలపై రంకెలేశారట. పార్టీ సంస్ధాగత ఎన్నికలకు పరిశీలకులుగా నియమించినా గైర్హాజరవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారట. 

ఆదివారం ఆయన తన నివాసంలో పార్టీ సంస్థాగత ఎన్నికల తీరుపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికలకు హాజరుకాని పరిశీలకుల నుంచి సంజాయిషీలు తీసుకోవాలసిందిగా రాష్ర్ట కార్యాలయాన్ని ఆదేశించారు. ఈ ఎన్నికల్లో ఒకటి రెండు చోట్ల ఘర్షణలు జరిగాయి. కృష్ణా జిల్లాలో ఏకంగా ఎమ్మెల్యే గాయాలైన పరిస్థితి నెలకొంది. నేతల అరాచకాలు.. నిర్లక్ష్యం చూసి రగిలిపోతున్న చంద్రబాబు త్వరలో కొంతమందిపై చర్య తీసుకుంటారట. ఎవరో ఒకరిపై చర్య తీసుకోకపోతే పార్టీకి మరింత చెడ్డపేరు రావడం ఖాయం అని నిర్థారణకు వచ్చిన ఆయన కనీసం ఇద్దరిపై చర్య తీసుకునేందుకు రెడీ అవుతున్నారట. 

 గ‌తంలో చిత్తూరు ఎంపీ శివ‌ప్ర‌సాద్‌రెడ్డి ఏవిదంగా పార్టీపై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారో అంద‌రికీ తెలిసిందే.ఎంత సేపూ.. ఎవరినీ క్షమించను.. క్రమశిక్షణ తప్పితే ఊరుకునేది లేదు.. అంటూ ప్రకటనలు ఇవ్వడమే కాకుండా చర్య తీసుకుని చూపించాలని పట్టుదలగా ఉన్నారట. మరి చంద్రబాబు కోపాని గురయ్యే వారి వరుసలో బోండా ఉమ, కేశినేని నాని, శివప్రసాద్, నిమ్మల కిష్టప్ప.. వీరిలో ఎవరు ఉంటారో మరి.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

  1. ఏపీ ప్ర‌భుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ‌
  2. చంద్ర‌బాబు అల్టిమేట్టం… అధిష్టానానిదే నిర్ణ‌య‌మ‌న్న అఖిల‌ప్రియ‌
  3. ప్ర‌శాంత్ కిషోర్‌తో డీల్… 2019 ఎన్నికలకు జ‌గ‌న్ ప‌క్కావ్యూహం..
  4. వచ్చే ఎన్నికల నేపథ్యంలో రైతులు, కూలీలకు సూపర్ ఆఫర్ ప్రకటించిన వైసీపీ

 

 

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -