Tuesday, May 7, 2024
- Advertisement -

చిరంజీవి రాజకీయాన్ని వదలి వెళ్లడం మంచిది

- Advertisement -

చేగొండి హరిరామజోగయ్యకు తన జీవితానుభవాలను వివరిస్తూ పలు విషయాలను ప్రస్తావించాడు.

మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి అండగా నిలవాలని అనుకుని ఆయనకు మద్దతు ఇవ్వడం, కాని చిరంజీవి సరిగా వాడుకోలేకపోవడం జరిగిందని,చిరంజీవిపై వచ్చిన టిక్కెట్ల అమ్మకం గురించి కూడా జోగయ్య ప్రస్తావించారు.

చిరంజీవి తన జనాకర్షణను ధనార్జనకు వాడుకున్నారని అబిప్రాయపడ్డారు. చిరంజీవి రాజకీయాన్ని పవన్ కళ్యాణ్ కు వదలి సినిమాలలోకి వెళ్లడం మంచిదని సలహా ఇచ్చారు.అలాగే పవన్ కళ్యాణ్ జనసేనను పార్టీగా మార్చాలని కూడా సలహా ఇచ్చారు.పవన్ కళ్యాణ్ కు నిబద్దత ఉందని జోగయ్య గారు వ్యాఖ్యానించారు. 

ఆ తర్వాత వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి రావాలని జగన్ కోరితే వెళ్లడం, కాని అక్కడ కూడా ఇమడలేకపోవడం, చేరడమే తప్పు అని భావించడం వంటి విషయాలను జోగయ్యగారు ప్రస్తావించారు.

అలాగే విజయవాడలో కాపు నేత వంగవీటి రంగా హత్యకు 1988 లో అప్పట్లో టిడిపిలో ప్రముఖ పాత్ర పోషించిన పర్వతనేని ఉపేంద్ర, చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని జోగయ్య తన పుస్తకంలో పేర్కొన్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -