సీఎం జగన్ పొగిడారు.. అడ్డంగా బుక్కయ్యాడు..!

- Advertisement -

విదేశీ మతాన్ని ఆచరిస్తున్న ముఖ్యమంత్రి జగన్​ను విష్ణుమూర్తిగా కీర్తించడం తిరుమల ప్రధాన అర్చకుడు రమణదీక్షితులకు తగునా అని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ప్రశ్నించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు ఎందుకు చేశారో రమణ దీక్షితులు ప్రజలకు సమాధానం చెప్పాలని సత్యకుమార్ నెల్లూరులో డిమాండ్ చేశారు. పింక్ డైమండ్ విషయంలో అపోహలు సృష్టించినందుకే రమణ దీక్షితులను పునర్నియామకం చేశారని సందేహం వ్యక్తం చేశారు.

రమణ దీక్షితులపై ముఖ్యమంత్రి జగన్ అభిమానం చాటుకోవాలంటే ఆయనను ఇడుపులపాయకు అర్చకుడిగా నిర్మించుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. తిరుమల ప్రధానార్చక పదవి నుంచి ఇడుపులపాయకు వెళ్తే జగన్​ను కీర్తించడంతోపాటు ఏకాంతసేవ చేసుకునేందుకు రమణ దీక్షితులకు అవకాశం ఉంటుందన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తే మాత్రం తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

- Advertisement -

వారికి మాత్రం వంద శాతం.. ఎందుకంటే..?

క్రేజీ కాంభో.. చరణ్ మూవీలో సల్మాన్ !

ఈ బ్యూటీకి కరోనా భయం ఇంకా పోలేదా?

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -