Friday, May 10, 2024
- Advertisement -

నా సొంత ఖర్చులతో మా భార్య మొక్కు తీరుస్తా : కేసిఆర్

- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తన భార్య శోభ మొక్కును తీర్చబోతున్నారు. అది ప్రభుత్వానికి సంబందం లేకుండా తన వ్యక్తిగత ఖర్చుతో మొక్కును నెరవేరుస్తున్నారట. సిద్దిపేటలో జరిగిన హరితహారంలో

ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తాను సిద్దిపేట నర్సరీలో మొలిచిన మొక్కను అని, ఈ మొక్క ఈనాడు యావత్తు తెలంగాణ కి నీడనిస్తోందని, ఇది తెలంగాణ ప్రజల వల్లే సాధ్యమైందని వ్యాఖ్యానించారు. తెలంగాణ వస్తే కాళేశ్వర స్వామికి తన భార్య బంగారు కిరీటం చేయిస్తానని మొక్కుకుందని, ఆ కిరీటం ఆయనకు పెట్టి మనం నీళ్ళు తెచ్చుకుందామని అన్నారు. ప్రభుత్వానికి ఎలాంటి సంబందం లేకుండా తన ఇంటి ఖర్చులతో బంగారు కిరీటం చేయిస్తానని చెప్పారు. ఇక సిద్దిపేటకు రైలు రావాల్సి ఉందని, త్వరలోనే అది కూడా వస్తుందని చెప్పారు. వచ్చే రెండు,మూడేళ్ళ వరకు కరెంట్ నిమిషం కూడా పోదని స్పష్టం చేశారు. పది పన్నెండేళ్ళ క్రితమే సిద్దిపేటలో మొక్కలు నాటామని, పది నిమిషాల్లో పదివేల మొక్కలు నాటామని చెప్పారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -