Thursday, March 28, 2024
- Advertisement -

తెలంగాణలో మళ్లీ పెరగనున్న చలి

- Advertisement -

తెలంగాణలో రానున్న మూడు రోజులు ఉష్టోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. రెండ్రోజులుగా సాధారణ ఉష్టోగ్రతలు నమోదు కాగా ..మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రానున్న మూడు రోజులు కనిష్ట, గరిష్ట స్థాయిలో హెచ్చుతగ్గులు నమోదయ్యే అవకాశం ఉంది.

రాష్ట్రంపై ఉత్తర, దక్షిణ ద్రోణి కొనసాగుతోంది. ఇది బిహార్ నుంచి ఛత్తీస్ గఢ్, విదర్భల ఉత్తర తెలంగాణ వరకు మీదుగా ఉత్తర తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 శాతం వరకు విస్తరించి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.

దీని ప్రభావంలో తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజులు (శని, ఆది, సోమ) వారాల్లో సాధారణ ఉష్టోగ్రతలు 11 డిగ్రీల నుంచి 15 డిగ్రీల లోపు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మొత్తంగా సాధారణ ఉష్టోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -