Thursday, April 25, 2024
- Advertisement -

కరోనా వచ్చింది… ఉరిశిక్ష తప్పింది..!

- Advertisement -

దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత మొదటిసారి ఓ మహిళకు విధిస్తున్న మరణశిక్షను అమెరికా ఫెడరల్​ కోర్టు తాత్కాలికంగా వాయిదా వేసింది. సదరు మహిళా దోషి తరఫు న్యాయవాదులు.. కరోనా వైరస్​ బారిన పడగా ఫెడరల్​ న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు.

లిసా మాంట్​గోమరీ’ అనే మహిళకు డిసెంబర్​ 8న ఇండియానాలోని టెర్రె హాట్ కారాగారంలో మరణ శిక్ష విధించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కానీ, ఆమె తరఫున వాదించే కెల్లీ హెన్రీ, అమీ హార్వెల్ అనే ఇద్దరు న్యాయవాదులకు కొవిడ్​ పాజిటివ్​గా తేలింది.

మాంట్​గోమరీ తీవ్రమైన మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని న్యాయవాదులు కెల్లీ, హార్వెల్​ చెబుతున్నారు. తనంతట తానుగా క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసే పరిస్థితుల్లో మాంట్​గోమరీ లేదని అంటున్నారు. తన మానసిక సమస్య కారణంగా మరే ఇతర న్యాయవాదులను మాంట్​గోమరీ విశ్వసించడం లేదని వారు కోర్టుకు తెలిపారు. తాము కరోనా బారిన పడ్డ ఈ పరిస్థితుల్లో ఆమెకు శిక్షను వాయిదా వేయాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరారు. న్యాయమూర్తి అందుకు సానుకూలంగా స్పందించారు.

హాంకాంగ్​కి అమెరికా మద్దతు..!

ఫైజర్‌ రావడానికి రంగం సిద్ధం..!

ట్రంప్ పోయాడు.. మాస్క్ వచ్చేసింది..!

నకిలీ సైనికులు.. జర జాగ్రత్త..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -