Sunday, April 28, 2024
- Advertisement -

వ‌ణుకుతున్న ఉత్త‌రాంధ్ర‌…

- Advertisement -

ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలపై విరుచుకుపడటానికి మరో భయంకర తుఫాన్ సిద్ధంగా ఉంది. తీర ప్రాంతాల్లో అల్లకల్లోలం సృష్టించడానికి శ‌ర వేగంగా దూసుకువస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా రూపం దాల్చింది.

దక్షిణ ఆగ్నేయదిశగా, గోపాల్ పూర్ కు 410 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిత్లీ, వాయవ్య దిశగా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతం కళింగపట్నానికి 340 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిత్లీ, మరో 12 గంటల్లో పెను తుపానుగా మారుతుందని, ఈ సాయంత్రానికి దాని ప్రభావం తీర ప్రాంతాలపై స్పష్టంగా కనిపిస్తుందని అధికారులు తెలిపారు.

తితిలీ తుఫాన్ కారణంగా రాగల 24 గంటల్లో ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చేపలు పట్టేవారు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం ఉదయం నాటికి తితిలీ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో తీర ప్రాంతమంతా భారీ వర్షాలు, వంద కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. సముద్ర అలలు ఎగసిపడతాయి. ఈ తుఫాను ప్రభావంతో ఇప్పటికే విజయనగరం జిల్లా భోగాపురంలోని ముక్కాం వద్ద సముద్రం 100 అడుగుల ముందుకు చొచ్చుకువచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -