Friday, May 3, 2024
- Advertisement -

డిజిటల్ రూపంలో ఓటరు కార్డు..!

- Advertisement -

ఓటరు కార్డుకు డిజిటల్​ రూపాన్ని ఇచ్చే యోచనలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఉన్నట్టు తెలుస్తోంది. సులువుగా అందుబాటులో ఉండేందుకు డిజిటల్​ కార్డులు ఉపయోగపడతాయని ఈసీ భావిస్తున్నట్టు సమాచారం. అయితే దీనిపై ఈసీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సీనియర్​ అధికారి పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం కార్డును ప్రింట్​ చేయటం, అవి ఓటరు వద్దకు చేరవేసేసరికి చాలా సమయం పడుతోంది. అందుకే సులభతర పద్ధతిలో డిజిటల్​ కార్డును అందుబాటులోకి తెచ్చేందుకు ఈసీ మొగ్గుచూపుతోంది. దీనికి సంబంధించి సలహాలు, సూచనలను క్షేత్రస్థాయి అధికారుల నుంచి తీసుకుంటోంది.

ఈ డిజిటల్​ కార్డులు.. ఫోన్, వెబ్​సైట్​, ఈ-మెయిల్​లో అందుబాటులో ఉంటాయా? అన్న విషయాన్ని ఈసీ నిర్ణయిస్తుందని అధికారి పేర్కొన్నారు. డిజిటల్​ విధానంలో ఫోటో సైతం క్షుణ్ణంగా కనిపిస్తుందని తెలిపారు. సాంకేతిక లోపాలు, సరైన భద్రతా చర్యలు తీసుకున్న తర్వాతే ఈ విషయంపై ఈసీ నిర్ణయం తీసుకుంటుందని మ రో అధికారి అభిప్రాయపడ్డారు.

పాన్​కార్డు, డ్రైవింగ్​ లైసెన్స్​, ఆధార్​లు ఇప్పటికే డిజిటల్​ రూపంలో అందుబాటులో ఉన్నాయి. 1993 నుంచి.. ఫోటోతో కూడిన ఓటరు కార్డునే గుర్తింపు కార్డుగా పరిగణిస్తోంది ఈసీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -