Friday, April 26, 2024
- Advertisement -

ట్రంప్ కీ మరో ఛాన్స్..!

- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించటం లేదు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఎన్నికల్లో కీలక రాష్ట్రమైన జార్జియాలో ఆడిట్​ (చేతితో లెక్కింపు) ముగిసిన కొద్ది రోజుల్లోనే మళ్లీ రీకౌంటింగ్​ చేపట్టారు అధికారులు. చేతితో లెక్కింపులో జో బైడెన్​ విజయం సాధించారు. ట్రంప్​పై 12,670 ఓట్లు, 0.25 శాతం మెజారిటీ సాధించారు. ఫలితాలను ధ్రువీకరించిన క్రమంలో రీకౌంటింగ్​ చేపట్టాలని కోరారు అధ్యక్షుడు ట్రంప్​.

రాష్ట్ర ఎన్నికల చట్టం ప్రకారం ఫలితాల్లో 0.5 శాతం లోపే మార్జిన్​తో ఓటమి చెందిన వ్యక్తి రీకౌంటింగ్​ కోరేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో రీకౌంటింగ్​ చేపట్టాలని గత శనివారం ఎన్నికల అధికారులను కోరింది ట్రంప్​ బృందం.ట్రంప్​ బృందం అభ్యర్థన మేరకు మంగళవారం ఉదయం 9 గంటలకు సుమారు 5 మిలియన్ల ఓట్లను యంత్రాలు(హైస్పీడ్​ స్కానర్లు) ద్వారా​ రీకౌంటింగ్​ ప్రారంభించారు. డిసెంబర్​ 2, రాత్రి 11.59 గంటల వరకు సమయం ఇచ్చారు.

కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్​ యంత్రాలను పరీక్షించాలని నిర్ణయించటం వల్ల ఆయా ప్రాంతాల్లో బుధవారం కౌంటింగ్​ ప్రారంభం కానుంది.

ఈ సినీ తారల ఆత్మహత్యల మిస్టరీ..!

40 ఏళ్ళ దాటుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

మన తెలుగు యాంకర్స్ రెమ్యునరేషన్స్ ఇవే..!

మన స్టార్ హీరోలకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -