Friday, May 24, 2024
- Advertisement -

ఉత్త‌ర కొరియాకు ట్రంప్ తీవ్ర హెచ్చ‌రిక‌లు

- Advertisement -
Donald Trump warns of ‘major, major conflict’ with North Korea

అమెరికా – ఉత్త‌ర కొరియా మ‌ధ్య మాట‌ల యుద్ధం త‌గ్గ‌లేదు. అమెరికా హెచ్చ‌రిక‌ల‌ను ఏమాత్రం కాత‌రు చేయ‌కుండా అనుప‌రీక్ష‌ల నిర్వ‌హించ‌డంలో ఏమాత్రం త‌గ్గ‌డంలేదు. యుద్ధానికి యుద్ధంతోనే బ‌దులు చెప్తామ‌ని పెద్ద‌న్న‌కే కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.

దీంతో అమెరికా మ‌రింత దూకుడుగా ముందుకెల్తోంది. అమెరికా ,ద‌క్ష‌ణ‌కొరియా,జ‌పాన్ దేశాలు సైనిక విన్యాసాల‌ను చేస్తుంటే ఉద్త‌రకొరియా కూడా ఏమాత్రం త‌గ్గ‌కుండా త‌న ఆయుధ సంప‌త్తిని ప్ర‌ద‌ర్శిస్తూ ధీటుగా మాట‌కు మాట స‌మాధానం ఇస్తోంది. ఏదేశం వెన‌క్కు త‌గ్గ‌క‌పోవ‌డంతో ఇప్పుడు యుద్ధం త‌ప్పేలాలేదు. తాజాగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్య‌లు ఇందుకు నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజా కామెంట్లతో ఇది నిజం అని తేలింది. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరకొరియాతో పెను సమస్య తప్పేటట్టు లేదని అభిప్రాయపడ్డారు. నిజానికి ఉత్తర కొరియా సమస్యను దౌత్య పరంగా పరిష్కరించాలన్న ఉద్దేశం ఉన్నా అలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపించడం లేదని ట్రంప్ అన్నారు. ఇప్ప‌టికే ఎన్ని సార్లు హెచ్చ‌రించినా ప‌లిత‌లేద‌న్నారు.ఐక్య‌రాజ్య‌స‌మితి ఆంక్ష‌ల‌ను కూడా లేక్క‌చేయ‌డ‌లేద‌నీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
ఉత్త‌ర కొరియా నిర్వ‌హిస్తున్న అనుప‌రీక్ష‌ల‌వ‌ల్ల‌ ఆసియా దేశాల్లో సందిగ్ధ‌నెల‌కొంది. ఈ నేపథ్యంలో అమెరికా యుద్దనౌకలు తాజాగా కొరియా ద్వీపకల్పానికి చేరుకున్నాయి. జలాంతర్గాములు – విమాన వాహక నౌకలు – థాడ్ మిస్సైళ్లు దక్షిణ కొరియా చేరాయి. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఉద్రిక్త పరిస్థితిని వివరిస్తూ ట్రంప్ ఈ వార్నింగ్ చేశారు. నార్త్ కొరియా మరోసారి అణు పరీక్షలు నిర్వహించకుండా ఉండేందుకు తమ ప్రభుత్వం వీలైనన్ని ప్రయత్నాలు చేసిందని ట్రంప్ అన్నారు. ముదుగా శాంతియుత ప‌రిస్కార మార్గాల‌పై దృష్టి సారిస్తామ‌ని చెప్పారు.
సైనిక చర్య కేవలం ఒక ఆప్షన్‌ మాత్రమేనని.. దాన్ని అమెరికా ప్రోత్సహించదని అమెరికా అధికారులు తెలిపారు. సైనిక దాడులు తీవ్ర ప్రాణనష్టాన్ని మిగుల్చుతాయన్నారు. గత కొంతకాలంగా ఉ.కొరియా ఖండాతర క్షిపణి ప్రయోగాలతో ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే నార్త్ కొరియా దూకుడును తగ్గించేందుకు చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. చైనా అధ్యక్షుడు జీ జింన్‌ పింగ్ ఈ అంశంలో వీలైనన్ని వ్యూహాలు రచిస్తున్నట్లు చెప్పారు. నార్త్ కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ దూకుడును ఆపేందుకు చైనా ఒత్తిడి తీసుకువస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

  1. ఏక్ష‌ణ‌మైనా యుధ్దం.. అంత‌ర్జాతీయంగా ఉద్రిక్త ప‌రిస్తితులు
  2. కొరియాస‌మీప‌జ‌లాల్లోకిఅమెరికా యుధ్ద‌నౌక‌లు-యుధ్ద‌వాతా వ‌ర‌ణం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -