Saturday, April 27, 2024
- Advertisement -

రగులుతున్న ఢిల్లీ..!

- Advertisement -

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. కేంద్రం దిగొచ్చేంతవరకు ఢిల్లీలోనే ఉంటామని.. నిరసనలు కొనసాగిస్తామని తేల్చిచెప్పారు భారతీయ కిసాన్​ యూనియన్​​ ప్రధాన కార్యదర్శి హరిందర్​ సింగ్​. ఢిల్లీ-హరియాణా సరిహద్దులోని సింఘూ వద్ద రైతులతో జరిగిన సమావేశం అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.


కేంద్ర ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని రైతులు వెల్లడించారు. ఇంతకు ముందు కూడా చర్చలు జరిగాయని.. కానీ ఎలాంటి ఫలితం దక్కలేదన్నారు. కొత్త చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

దేశరాజధానికి రైతుల తాకిడి గంటగంటకూ పెరుగుతోంది. తాజాగా.. ‘ఢిల్లీ ఛలో’లో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో రైతులు ట్రాక్టర్లు, బస్సుల్లో ఢిల్లీకి బయలుదేరారు. శంభూ వద్ద పంజాబ్​-హరియాణా సరిహద్దును దాటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -