Monday, April 29, 2024
- Advertisement -

ఎంత కష్టం.. కరోనా సోకిన భర్త.. ఆ భార్య ధైర్యం చూస్తే కన్నీరు పెట్టుకుంటారు..

- Advertisement -

దేశంలో కరోనా కాటుకు ఎంతో మంది బలి అవుతున్నారు. కళ్ల ముందే తమ వారు కన్నుమూస్తుంటే నిస్సాహాయంగా చూస్తూ ఉండే పరిస్థితి నెలకొంది. కరోనా మహమ్మారి దేశంలో దారుణంగా విజృంభిస్తుంది. ఇక ఆక్సీజన్ కొరతతో కరోనా రోగులు ఆసుపత్రి ముందే ప్రాణాలు విడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆక్సిజన్ అందని భయంకర పరిస్థితులకు అద్దం పడుతోంది ఓ భార్య భర్తకు నోటిలో నోరు పెట్టి శ్వాసను అందించే ఘటన.

శ్వాస ఆడక.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన భర్తను కాపాడుకోవడం కోసం.. భార్య తన నోటితో శ్వాస అందిస్తూ బ్రతికించుకునే ప్రయత్నం చేసింది. అయినా.. భర్త ప్రాణం నిలవకపోవడంతో.. ఆ మహిళ గుండెలవిసేలా రోదించింది.ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ప్రస్తుత కరోనా బీభత్సం సృష్టిస్తుంది. ఆగ్రాలోని హౌసింగ్ డెవలప్‌మెంట్ సెక్టార్ -7 నివాసి రవి సింఘాల్ అనే 47 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది.

అతని భార్య రేణు సింఘాల్ బంధువులతో కలిసి ఆసుపత్రికి ఆటోలో బయలు దేరింది. ముందు రామా హాస్పిటల్ ఆ తర్వాత సాకేత్ హాస్పిటల్, కేజీ నర్సింగ్ హోమ్‌కు వెళ్లినా.. పడకలు అందుబాటులో లేక సింఘాల్‌ను చేర్చుకులేదు. చివరకు రేణు తన భర్తను తీసుకోని ఆటోలో ఎస్ఎన్ మెడికల్ కాలేజీకి చేరుకుంది. ఆ సమయంలోనే ఆయనకు ఊపిరి ఆడక పోవడంతో గిల గిలా కొట్టుకున్నాడు.. భర్త అవస్త చూడలేక అతడిని ఎలాగైనా కాపాడుకోవాలోననే తపనతో ఎవ్వరూ చేయని సాహసం చేసింది.కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భర్త నోటిలో నోరు పెట్టి శ్వాసం నందించింది.

ఎలాగైనా తన భర్త ప్రాణాన్ని దక్కించుకోవాలని పదే పదే నోటితో శ్వాస అందించింది. కానీ ఫలితం దక్కలేదు. భర్త ప్రాణాలు నిలవలేదు. కరోనా కాటుకు ఆమె భర్త ప్రాణాలు కోల్పోయాడు. ఎలాగైనా తన భర్త ప్రాణాన్ని దక్కించుకోవాలని పదే పదే నోటితో శ్వాస అందించింది. కానీ ఫలితం దక్కలేదు. భర్త ప్రాణాలు నిలవలేదు. కరోనా కాటుకు ఆమె భర్త ప్రాణాలు కోల్పోయాడు.

వైరల్ :లగ్జరీ కారు కొన్న బిగ్ బాస్ కంటెస్టెంట్.. దారుణమైన కామెంట్స్ చేసిన యాంకర్ రవి!

రంగస్థల నటుడు ప్రకాశ్ రాజు ఇకలేరు!

ఎన్నో కష్టాలు ఎదిరించిన గొప్ప నటుడు పొట్టి వీరయ్య : చిరంజీవి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -