Tuesday, April 23, 2024
- Advertisement -

దిగొచ్చిన బంగారం.. పతనంలో వెండి!

- Advertisement -

దేశంలో కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. మరోవైపు వ్యాపార వ్యవస్థలపై కూడా ఈ ప్రభావం దారుణంగా పడుతుంది. ఇదిలా ఉంటే గత కొన్ని నెలల నుంచి బంగారం, వెండి ధరలు మాత్రం అమాంతం పెరుగుతూ వినియోగదారులను కంగారు పెడుతూనే ఉంది. అయితే ఈ ధరలు మాత్రం హెచ్చుతగ్గులు అవుతూ వస్తుంది. తాజాగా బంగారం ధరలు పతనమయ్యాయి.

బంగారం ధరలు దిగిరాగా తాజాగా వెండి సైతం బంగారం దారిలోనే పయనిస్తూ ధర తగ్గింది. నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,764కి పడిపోయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,700 అయింది. ఢిల్లీ మార్కెట్‌‌లో సైతం గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పతనమవుతున్నాయి.

విజయవాడ, హైదరాబాద్‌‌లలో బంగారం ధర రూ.340 మేర తగ్గింది. నేటి మార్కెట్‌లో బంగారం ధరలు రూ.350 మేర తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,100 అయింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపై రూ.310 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.67,850కి క్షీణించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -