Friday, April 26, 2024
- Advertisement -

తెలంగాణలో మాస్క ధరించని వారిపై పోలీసుల కొరడా

- Advertisement -

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. గత కొన్ని రోజులుగా కేసులు పెరిగిపోతున్నాయి.. మొన్నటి వరకు వందల్లో అయితే ఇప్పుడు వేలు దాటుతున్నాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,34,738కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,07,499 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,780గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 25,459 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 

ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. కరోనా పేషెంట్లకు హైదరాబాద్ ఆసుపత్రుల్లో బెడ్లు, వెంటిలేటర్లు కూడా దొరకని పరిస్థితి ఆందోళనను పెంచుతోంది. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 361 మందికి క‌రోనా సోకింది.ఇదిలా ఉంటే రాష్ట్రంలో మాస్క్ ధరించని వారిపై కఠినంగా ప్రవర్తిస్తున్నారు పోలీసులు.

మాస్క్ ధరించని వారిపై కేసులు నమోదు చేస్తామని, రూ. 1000 జరిమానా విధిస్తున్నామని హెచ్చరించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా కూడా మాస్కులు లేని వారిని గుర్తించి, కేసులు నమోదు చేసి, జరిమానా విధిస్తామని మహేశ్ భగవత్ వార్నింగ్ ఇచ్చారు.  ఇదిలా ఉంటే మాస్క్ ధరించని 832 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. 

ప్రపంచంలో ఎక్కడలేని అంత పెద్దది ఇక్కడే..!

అంబేడ్కర్ బాటలో సీఎం కేసీఆర్: హరీష్ రావు

తమిళనాడులో ఘోరం.. 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -