Tuesday, March 19, 2024
- Advertisement -

గూగుల్ మ్యాప్స్ లో క్రేజీ ఫీచర్ ..సూపర్ !

- Advertisement -

ప్రస్తుతం ప్రపంచం అంతా స్మార్ట్ పోన్ మయం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మానవుడు ఉన్న చోటునుంచే ప్రపంచం నలుమూలల సమాచారాన్ని తెలుసుకుంటున్నాడు. ఇక ఒకప్పుడు మనం ఏదైనా వేరే ఊరికి వెళ్లాలంటే.. ఆ ఊరికి వెళ్ళే బస్సు..దారి ఇలా అన్నీ కనుక్కొని వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అయినప్పటికి అయినప్పటికి దారులు తప్పుతూ..చేరవలసిన గమ్యస్థానాన్ని చేరుకోలేక నానా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్లం.. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవనే చెప్పాలి. ఇప్పుడు స్మార్ట్ పోన్ ఉపయోగించి చేరవలసిన గమ్యస్థానాన్ని సులభంగా చేరుకోగలుగుతున్నాం.

ముఖ్యంగా గూగుల్ సంస్థ తీసుకొచ్చిన గూగుల్ మ్యాప్స్ వల్లే రవాణా చాలా సులభతరం అయిందనే చెప్పాలి. అయితే ఎప్పటికప్పుడు మ్యాప్స్ లో కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తెస్తూ యూసర్స్ కు మరింత చేరువ అవుతోంది గూగుల్ మ్యాప్స్, ఈ నేపథ్యంలో మరొక కొత్త ఫీచర్ ను మ్యాప్స్ లో యాడ్ చెయ్యనుంది గూగుల్ సంస్థ. అయితే ఇప్పటి వరకు గూగుల్ మ్యాప్స్ లో రూట్స్ సంభంధించిన అన్నీ వివరాలు ఉన్నప్పటికి ఆయా రూట్స్ లో ఉండే టోల్ గేట్స్ వివరాలు మాత్రం పూర్తి స్థాయిలో ఉండేవి కావు.

దాంతో దార్లో ఎదురయ్యే టోల్ గేట్స్ వద్ద చార్జస్ ఎలా ఉంటాయి ? అనే విషయాలు తెలియకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీన్ని గమనించిన గూగుల్ సంస్థ .. మ్యాప్స్ లో టోల్ గేట్స్ కు సంభంధించిన అన్నీ వివరాలను పూర్తిగా తెలుసుకునే విధంగా ఒక కొత్త ఫీచర్ ను తీసుకు రాబోతుంది. కొత్తగా రాబోయే ఈ ఫీచర్ వల్ల ఏ రూట్లో ఎన్ని టోల్ గేట్స్ ఉన్నాయి. ఆ టోల్ గేట్స్ వద్ద ఎంత ఛార్జీలు వసూలు చేస్తున్నారు .. వంటి విషయాలను ముందే తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ వల్ల దురప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు టోల్ గెట్ చార్జీలను బట్టి వారి బడ్జెట్ ప్రణాళికలు వేసుకోవచ్చు. ఈ ఫీచర్ ను భారత్ తో పాటు, అమెరికా, జపాన్, ఇండోనేషియా వంటి దేశాలలో కూడా గూగుల్ మ్యాప్స్ లో తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది..

ఇవి కూడా చదవండి

మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ పెంచే అద్బుతమైన టిప్స్ !

వి‌పి‌ఎన్ వాడే వారికి షాక్ ఇచ్చిన కేంద్రం !

అతి త్వరలో 4జి కి గుడ్ బై ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -