- Advertisement -

ఆ మిస్టరీ స్టోన్.. ఏలియన్స్‌ పనేనా?

- Advertisement -

ప్రపంచంలోని పలు దేశాల్లో కనిపించి మాయమవుతున్న వింత లోహపు స్తంభం ఇండియాలోనూ కనిపించింది. ఈ నిర్మాణాలను చూస్తూంటే.. గ్రహాంతర వాసులే ఈ పని చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 నగరాల్లో కనిపించి ఆశ్చర్యపరిచిన మోనోలిత్‌ రాయి ఇప్పుడు మన దేశంలో ప్రత్యక్షమైంది.  అసలే ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న సమయంలో ఇలాంటి మిస్టీరియస్ వ్యవహారాలు మరింత భయపెడుతున్నాయి.

ఎక్కడా మట్టిని తవ్విన ఆనవాళ్లు లేకుండా ఈ శిలను భూమిలో పాతిపెట్టినట్టుగా కనిపిస్తుండటం గమనార్హం. ఇక ఈ ఘటనపై పార్కును పర్యవేక్షిస్తున్న ఆశారామ్ స్పందిస్తూ, ఇది ఎలా ఈ ప్రాంతానికి వచ్చిందో తెలియడం లేదన్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన ఘటనని, బుధవారం సాయంత్రం అసలు ఆనవాలే లేని లోహపు శిల, గురువారం వచ్చి చూసేసరికి ఎలా వచ్చిందో తెలియడం లేదని అన్నారు.

ఇది 6 అడుగుల పొడవుతో ఏకశిలా లోహంతో తయారైనట్లుగా ఉన్నది. భారతదేశంలో ఇటువంటి ఏకశిలా చూసిన మొదటి ప్రాంతం ఇదే. అయితే దీని నిర్మాణం కోసం భూమిని తవ్విన ఆనవాళ్లు ఎక్కడా కనిపించడం లేదు.  బేస్ మట్టం కూడా ఎక్కడా లేదు. అసలు ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అనేది మిస్టరీగా మారింది.  ఏకశిల పైభాగంలో ఏవో సంఖ్యలు కనిపిస్తున్నాయి. వాటి అర్థం ఏంటో తమకు తెలియదని అంటున్నారు పార్కు నిర్వాహకులు. 

వీటిని గ్రహాంతర వాసులు తెచ్చి పెడుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బంగారం వర్ణంలోనూ, మరికొన్ని ప్రాంతాల్లో లోహంతో తయారు చేసినట్టుగా ఇవి దర్శనమిచ్చి, మాయమైపోతున్నాయి.

ఓరి నాయనో.. ఒక్క నిమిషంలో 4,100 ఫుడ్ ఆర్డర్లు..!

అరుణాచల్​ ప్రదేశ్​ వద్ద చైనా రైల్వే ట్రాక్ పూర్తీ..!

షూగర్ వ్యాధి ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

టాలీవుడ్ హాస్య నటులు అందుకున్న నందులు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -