వి‌పి‌ఎన్ వాడే వారికి షాక్ ఇచ్చిన కేంద్రం !

- Advertisement -

ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా ఇంటర్నెట్ మయం అయిపోయింది. అరచేతిలో స్మార్ట్ పోన్ ద్వారా ప్రపంచ నలుమూలల సమాచారాన్ని చిటికెలో తెలుసుకుంటున్నారు..దాంతో రోజు రోజుకు పెరుగుతున్న ఈ టెక్నాలజీ కారణంగా ఇంటర్నెట్ వాడకం మరింత పెరుగుతోంది. అయితే ఈ ఇంటర్నెట్ వల్ల లాభాలు ఏస్థాయిలో ఉన్నాయో, నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా మొబైల్స్ లో థర్డ్ పార్టీ యాప్స్ యూస్ చేసినప్పుడు, లేదా బ్రౌసింగ్ లో అన్నౌన్ వెబ్సైట్స్ ఓపెన్ చేసినప్పుడు మొబైల్స్ ఎక్కువ శాతం హ్యాకింగ్ కు గురి అవుతుంటాయి.

హ్యాకింగ్ కు గురి కావడం వల్ల మన మొబైల్ లోని పర్సనల్ డేటా అంతా కూడా ఇతరుల చేతికి వెళ్లిపోతుంది. అయితే ఇది తెలిసినప్పటి చాలా మంది అన్నౌన్ వెబ్సైట్స్ లోకి వెళ్ళడం మాత్రం మనడంలేదు. వి‌పి‌ఎన్ వంటివి వాడుతూ అన్నౌన్ వెబ్సైట్స్ లోకి వెళ్ళి హ్యాకింగ్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ కీలక ఆదేశాలు జారీ చేసింది. నార్డ్ వి‌పి‌ఎన్, ఎక్స్ ప్రెస్ వి‌పి‌ఎన్, వంటివి ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించకూడదని హెచ్చరించింది.

- Advertisement -

అంతే కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన డేటా ఫైల్స్, అతి ముఖ్యమైన అంతర్గత సమాచారాన్ని ప్రభుత్వేతర క్లౌడ్ విభాగాలైన గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్, వంటి వాటిలో కూడా స్టోర్ చెయ్యవద్దని హెచ్చరించింది. సైబర్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నివారంచడానికి ఎస్ ఐ సి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వి‌పి‌ఎన్ వంటివి ప్లే స్టోర్ లో కనిపించే అవకాశం కూడా తక్కువే. ఎందుకంటే కేంద్ర నిర్ణయంతో సర్ఫ్ షార్క్, ఎక్స్ ప్రెస్ వి‌పి‌ఎన్, నార్డ్ వి‌పి‌ఎన్ సర్వీసులను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించాయి. ఇక ఆయా వి‌పి‌ఎన్ సంస్థలు కూడా భారత్ లో సేవలు నిలిపివేసే అవకాశం ఉంది. దీంతో ఇక వి‌పి‌ఎన్ యాప్స్ ప్లే స్టోర్ లో కనిపించే అవకాశం లేదు.

ఇవి కూడా చదవండి

అతి త్వరలో 4జి కి గుడ్ బై ?

ఒన్ ప్లేస్ : కిల్లింగ్ ప్రైజ్ లో.. సూపర్ ఫీచర్స్ ..మిస్ చేయొద్దు !

కృత్రిమ మానవులు వచ్చేస్తున్నారోచ్ ..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -