Thursday, May 2, 2024
- Advertisement -

ఇంటర్ నెట్ వినియోగంలో నెంబర్ టూ భారత్

- Advertisement -

ఇంటర్ నెట్. భారతదేశంలో నానాటికి దీని వినియోగం పెరిగిపోతోంది. అది కూడా ఎంతంటే ఏకంగా అమెరికన్లను మించిపోయి మరీ మనవాళ్లు ఇంటర్ నెట్ ని వినియోగిస్తున్నారు.  అత్యధిక ఇంటర్ నెట్ వినియోగదారుల్లో చైనా నెంబర్ వన్ స్ధానాన్ని సంపాదించుకుంది. ఆ తర్వాత స్ధానంలో మొన్నటి వరకూ అమెరికా ఉండేది.

తాజాగా అమెరికన్లను వెనక్కి నెట్టేసి భారతీయులు రెండో స్ధానాన్ని కైవసం చేసుకున్నారు. భారతదేశంలో 27.7 కోట్ల మంది భారతీయులు ఇంటర్ నెట్ ను వినియోగిస్తున్నారు. ప్రముఖ సంస్ధ కెపిసిబీ భాగస్వామి సంస్ధ అయిన మేరీ మీకర్ రూపొందించిన వార్షిక ఇంటర్ నెట్ ట్రండ్స్ లో ఈ విషయం వెల్లడైంది.

గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్ నెట్ వినియోగదారుల సంఖ్య 7 శాతం పెరిగింది. అదే భారత్ లో అయితే 40 శాతం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. నిజానికి అమెరికాతో పోలిస్తే ఇంటర్ నెట్ ఖర్చు భారత్ లోనే ఎక్కువ. అయినా ఇక్కడి వారు మాత్రం ఇంటర్ నెట్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -