Monday, May 6, 2024
- Advertisement -

న‌మ్మ‌లేని నిజం: చీమ కుట్ట‌డంతో మ‌హిళ మృతి

- Advertisement -

పాము, తేలు కుడితే కొద్ది నిమిషాలు, గంట‌ల‌కు మ‌నుషులు మృతి చెందడం సాధార‌ణం. కానీ ఇప్పుడు చీమ కుడితే కూడా చ‌నిపోయే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇది న‌మ్మ‌లేని నిజం. చిన్న చీమ అని చుల‌క‌న భావంతో వ‌దిలేస్తే అది మీ ప్రాణాల‌నే బ‌లి తీసేలా మారుతోంది. ఇది ఉత్త‌మాట కాదు.. కేర‌ళ‌లో చీమ కుట్టి ఓ మ‌హిళ మృతి చెంద‌డంతో చెబుతున్న వాస్త‌వాలు. చీమ కాటుకు మహిళ చనిపోయిందనే విషయం ఆశ్యర్యానికి గురిచేస్తోంది.

కేరళ రాష్ట్రంలోని అడూర్ సిటీకి చెందిన సూసీ జెఫీ (36) సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో కుటుంబంతో కలసి నివసిస్తుండేది. ఈ సంవ‌త్స‌రం మార్చి 19వ తేదీన తన ఇంట్లో నడుస్తున్న సమయంలో ఓ చీమ సూఫీని కుట్టింది. దీనికి పెద్ద‌గా ఆమె స్పందించ‌లేదు. అందరిలాగే చీమ కుడితే ఏమవుతుందిలే అనుకుని త‌న ప‌నులు తాను చేసుకుంది. ఆ తర్వాత తీవ్రమైన నొప్పి రావడంతో వెంట‌నే ఆస్ప‌త్రికి ప‌రుగెత్తింది. ఆమెను కుట్టిన చీమ ద్వారా ఆమె శరీరంలోకి విషం వచ్చిందని వైద్యులు నిర్ధారించి షాక్‌కు గుర‌య్యారు. చివ‌రికి ఆమెను చికిత్స నిమిత్తం రెండువారాలుగా ఐసీఐలో వైద్యం అందించారు. చికిత్స పొందుతూనే ఏప్రిల్ 3వ తేదీ మంగళవారం చనిపోయింది. కొన్ని కీటకాలు చాలా ప్రమాదకరమైనవని.. వాటిని లైట్ తీసుకోవద్దని వైద్యులు ఈ సంద‌ర్భంగా చెబుతున్నారు.

అయితే అలాంటి చీమ‌లు మ‌న భార‌త‌దేశంలో లేవ‌ని చెబుతున్నారు. చీమే కదా అని లైట్ తీసుకున్న సూఫీ చివ‌రికి ప్రాణాలు పోయేంత అయ్యిందంటే అందర్నీషాక్‌కు గురి చేస్తోంది.

కొన్ని చీమల్లో కూడా విషం ఉంటుంద‌ని కొంద‌రు చెబుతున్నారు. ఆ చీమ‌లు కుడితే సేమ్ పాము, తేలు మాదిరి మాన‌వుల ప్రాణాల‌కు ముప్పులు ఉంటుంది అని పేర్కొంటున్నారు. అయితే అలాంటి చీమలు ఎక్కడ ఉంటాయ్.. ఏయే ప్రాంతాల్లో జీవిస్తాయి అనే విష‌యాలు ఇంకా తెలియ‌దు. ప్ర‌స్తుతం సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరగడంతో ఎడారి ప్రాంతంలో ఇలాంటి చీమ‌లు ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -