Sunday, April 28, 2024
- Advertisement -

జయ కేసు తీర్పు.. జగన్ హ్యాపీ..?!

- Advertisement -

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను నిర్ధోషిగా తేల్చింది న్యాయస్థానం. ఇంతకు ముందే ఆమె దోషిగా నిరూపితమై.. ఐదు సంవత్సరాలశిక్షను, వందకోట్ల రూపాయల జరిమానాను ఎదుర్కొంటున్న కేసులో ఆమె నిర్దోషిగా తేలింది.  

చాలా కాలం పాటు ఈ కేసులో దర్యాప్తును జరిపిన కోర్టు.. సీబీఐలు జయలలిత విషయంలో చేష్లలుడిగిపోయాయి. 

ఆమె నిర్దోషిగా నిరూపితమైంది… దోషిగా నిలిచిన సమయంలో ఆమె కోల్పోయిన తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం మళ్లీ దక్కే అవకాశాలున్నాయిప్పుడు. మరి ఇలాంటి నేపథ్యంలో జయలలిత కేసు తీర్పు పక్క రాష్ట్రం ఏపీపై కూడా ప్రభావాన్ని చూపుతుందను కోవాలి.

ప్రత్యేకించి ఏపీలో కూడా ఇలాంటి ఆస్తుల కేసులో కేసును ఎదుర్కొంటున్న వ్యక్తి ఉన్నాడు. ఆయనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి. జయపై నమోదైనదీ అక్రమాస్తుల కేసే.. జగన్ పై నమోదు అయినదీ అక్రమాస్తుల కేసే! అక్కడికీ జయపై నమోదైన కేసే తీవ్రమైనది! ఆమె ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆస్తులు సంపాదించుకొన్నారనేది ఆరోపణ.

అయితే జగన్ ఆస్తులు సంపాదించుకొన్న సమయానికి అతడు ప్రజాప్రతినిధి కూడా కాదు. దీంతో ఆయనపై సెక్షన్లు వీక్ అవుతున్నాయి. ఇలాంటి నేపధ్యంలో జయ లలితే నిర్దోషిగా తేలడం జగన్ మోహన్ రెడ్డికి కొంత స్థైర్యాన్ని ఇవ్వవచ్చు. అయితే కేసు విచారణ చాలా సంవత్సరాల పాటు జరిగితే కానీ జయకు విముక్తి లభించలేదు. మరి జగన్ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందా?!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -