Wednesday, May 8, 2024
- Advertisement -

తాతయ్యను అందరూ వదిలేశారు…క‌న్నీరు పెట్టుకున్న జూనియ‌ర్‌

- Advertisement -

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ కు ఘోర అవ‌మానం జ‌రిగింది. ప్ర‌తీ సంవ‌త్స‌రం టీడీపీ శ్రేణులు ఆయ‌న జ‌యంతి నాడు ఎన్టీఆర్ ఘాట్‌ను అదంగా ముస్తాబు చేసి ఘ‌నంగా నివాలులు అర్పించేవారు. కాని ఈసారి ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవ‌డంతో ఈసారి ఎన్టీఆర్ జ‌యంతిని ప‌ట్టించుకోలేదు. దీంతో అన్న అభిమానులు గుర్రుగా ఉన్నారు.

స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సంద‌ర్భంగా ఆయ‌న ఘాట్‌కు నివాలులు అర్పించేందుకు జూనియ‌ర్ కుటుకంభం అక్క‌డ‌కు వ‌చ్చింది. ఆయన సమాధి వద్ద చోటుచేసుకున్న ఘటన ఆయన అభిమానులతో పాటు కుటుంబసభ్యులను కలచివేసింది. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా భావించే ఎన్టీఆర్ జయంతి రోజు ఆయన సమాధిని అలకరించకపోవడంతో అందరూ మండిపడుతున్నారు.

ఎన్టీఆర్ మనవళ్లు తారక్, కల్యాణ్‌రామ్ తెల్లవారుజామున నివాళులర్పించేందుకు వచ్చే సమయానికి ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఒక్కపువ్వు కూడా లేదుక పోవ‌డంతో ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఘాట్ పై పుష్పాలంకరణను వెంటనే ఏర్పాటు చేయాలని అక్కడే ఉన్న కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు. ఆ వెంటనే జూ.ఎన్టీఆర్ తన అనుచరులతో భారీ పుష్ఫాలను తెప్పించడంతో ఎన్టీఆర్ అభిమానులు తలోచేయి వేసి సమాధిని సుందరంగా అలంకరించారు. అనంతరం తారక్, కళ్యాణ్‌రామ్.. తాత సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. జయంతి ఏర్పాట్లపై మనస్తాపం చెందిన తారక్.. ఇకపై తాత జయంతి, వర్థంతి వేడుకల ఏర్పాట్లను సయంగా తానే చూసుకుంటానని ప్రకటించి వెళ్లిపోయారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -