Monday, May 6, 2024
- Advertisement -

పుత్రరత్నం కోసం భూ పందేరం

- Advertisement -

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. తన కుమారుడికి మేలు చేయడంలో భాగంగా ఏకంగా 150 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని శాంత ఇండస్ట్రీస్ కు కట్టబెట్టారన్నది ఆరోపణ. దాదాపు 150 కోట్ల రూపాయలు విలువ చేసే 2.19 ఎకరాల భూమి ఇంతకు ముందు శాంత ఇండస్ట్రీస్ కు ప్రభుత్వం ఇచ్చింది.

అయితే 1977 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఈ భూమిని బిడిఎకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి శాంత ఇండస్ట్రీస్ తమ భూమి తమకు ఇవ్వాలని, ఇందుకు ప్రభుత్వానికి మరోచోట భూమి ఇస్తామంటూ ప్రతి పాదనలు పంపించింది. అయితే ఆ ఫైలు మాత్రం సంవత్సరాలు గడచినా కదలలేదు. తాజాగా ముఖ్యమంత్రి సిద్ధ  రామయ్య కుమారుడు యతీంద్ర జోక్యంతో ఈ ఫైలుకు రెక్కలొచ్చాయి.

2016 జనవరి నెలలో బిడిఎ ద్వారా ఈ భూమిని ఉచితంగా శాంత ఇండస్ట్రీస్ కు కట్టబెట్టారు. ఈ విషయాన్ని బెంగళూరుకు చెందిన ఆర్టీఐ కార్యకర్త కోదండరామ్ వెలుగులోకి తీసుకువచ్చారు. శాంత ఇండస్ట్రీస్ లో సిఎం కుమారుడు యతీంద్ర స్నేహితుడు డైరక్టర్ కావడంతో ఈ భూదందా కార్యక్రమం ఇంత వేగంగా కదిలిందని కోదండరామ్ విలేకరుల సమావేశంలో చెప్పారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -