Monday, April 29, 2024
- Advertisement -

బెండకాయ.. పోషకాల గని..అస్సలు వదలరు!

- Advertisement -

మానవ శరీరానికి పోషకాలు ఎంతో అవసరం. అయితే మనం తినే జంక్ ఫుడ్ వల్ల అనేక సమస్యల బారిన పడుతున్నాం. కానీ క్రమేణా ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగి ఇప్పుడిప్పుడే ఆకు కూరలతో పాటు కుర గాయాలను తినే వారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రధానంగా కురగాయాలతో అధిక ప్రయోజనాలు ఉంటాయి. అలాంటి వాటిలో బెండకాయ ఒకటి.

బెండకాయకు ఉండే జిగురు గుణం కారణంగా తినటానికి ఎక్కువ మంది ఇష్టపడరు. అయితే బెండకాయలోని పోషకాల గురించి తెలిస్తే ఇకపై తినకుండా ఉండలేరు. బెండ సర్వరోగ నివారిణి. ఇందులో విటమిన్ బీ, విటమిన్ సి,కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్ వంటి అన్నీ మూలకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని వివిధ క్యాన్సర్ కారకాలను ఎదుర్కోవడంలో సహాయ పడుతుంది.

చెడు కొలెస్ట్రాల్ శాతం తగ్గాలంటే బెండకాయ తినాల్సిందే. తద్వారా గుండె సమస్యలు దరిచేరవు. ప్రతిరోజూ మనం తినే ఆహారంలో బెండకాయను చేర్చుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని వేగంగా పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది బెండకాయ. గర్భిణీ స్త్రీలు తప్పకుండా బెండకాయతో చేసిన వంటలు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆర్థరైటిస్ తో బాధపడేవారు తప్పకుండా బెండకాయ తినాలని ఇందులో ఉండే కెరోటీన్లు, ఫ్లేవనాయిడ్లు, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తాయి. కాబట్టి ఇప్పటివరకు బెండకాయ తినని వారు ఇకపై మనసు మార్చుకుని ఏం చక్కా బెండకాయను లాగించేయండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -