Friday, April 26, 2024
- Advertisement -

ఈటల రాజేందర్‌కు హైకోర్టులో ఊరట.. కలెక్టర్ ఇచ్చిన నివేదిక చెల్లదు..

- Advertisement -

ఈటల భూ కుంభకోణంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరిగా లేదని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలో రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు విచారణ జరపడం, ప్రభుత్వానికి కలెక్టర్ నివేదిక సమర్పించడం చట్టం ప్రకారం, సక్రమమైన తీరులో జరగలేదని, అందువల్ల అది చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. సహజ న్యాయసూత్రాలను అధికారులు తీవ్రంగా ఉల్లంఘించారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

జమున హేచరీస్‌ భూములు, వ్యాపారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. వెనుక గేటు నుంచి కాకుండా రాజమార్గంలో వెళ్లి విచారణ చేయాలని ఆదేశించింది. శుక్రవారం నోటీసులు ఇచ్చి సోమవారం సమాధానం ఇవ్వమనేలా ఉండకూడదని అభిప్రాయపడింది.

ఈ కేసు తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. జమున హేచరీస్ సంస్థ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. నోటీసులు ఇచ్చి నిబంధనల ప్రకారం సమయం ఇవ్వాల్సి ఉందని హైకోర్టు సూచించింది.

కంగనా రనౌత్‌ ట్విటర్ ఖాతాకు బ్రేక్.. కారణం అదేనా?

వామ్మో.. ఆ ఊరిలో ఒక్కసారే 600మందికి క‌రోనా పాజిటివ్.. ఇద్దరు మృతి

మృత‌దేహాన్ని పీక్కుతింటోన్న వ్య‌క్తి.. భయంతో వణికిపోయిన జనాలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -