Saturday, April 27, 2024
- Advertisement -

కాంగ్రెస్ తెచ్చింది.. బీజేపీ చట్టం చేసింది!

- Advertisement -

ఆధార్ కార్డుల గురించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత హంగామా చేసిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా అందుకు ఏ మాత్రం తక్కువ తినలేదని ప్రూవ్ చేసుకుంటోంది. మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యూపీయే ప్రభుత్వం అమలు చేసిన ఆధార్ కార్యక్రమాన్ని.. ఇప్పటి మోడీ ప్రభుత్వం చట్టంగా మార్చేస్తోంది.

అవినీతిని తగ్గించేందుకు.. అర్హులకే సంక్షేమ పథకాల ఫలాలు అందించేందుకు.. ఆధార్ ఉపయోగపడుతోందని కేంద్రం తెలిపింది. అంతే కాక.. ఆధార్ ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, పుదుచ్చేరిలో 2 వేల 300 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వానికి డబ్బులు ఆదా అవుతున్నాయని కేంద్రం లోక్ సభలో వివరించింది.

ఈ వివరాలన్నీ చెబుతూ.. ఆధార్ బిల్లును లోక్ సభలో పాస్ చేయించింది. అయితే.. ఆధార్ బిల్లును మామూలు రూపంలో కాక.. ద్రవ్య బిల్లు రూపంలో సభ ముందుకు తెచ్చింది. ఈ రకమైన బిల్లుకు ఓ స్పెషాలిటీ ఉంది. లోక్ సభలో పాసైన ద్రవ్య బిల్లును.. రాజ్యసభలో కేవలం చర్చకు మాత్రమే అనుమతిస్తారు. 14 రోజుల్లో ద్రవ్యబిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. తీసుకోకున్నా.. అది చట్టంగా మారుతుంది.

అందుకే.. వ్యూహాత్మకంగా లోక్ సభలో ఆధార్ బిల్లును గడప దాటించిన కేంద్రం.. రాజ్యసభలోనూ ద్రవ్య బిల్లు రూపంలో ఆధార్ ను పాస్ చేయించేందుకు గట్టి కసరత్తే చేసింది. దీంతో.. త్వరలోనే ఆధార్ చట్టంగా మారనుంది. ఇది అమల్లోకి వస్తే.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల నుంచి లబ్ధిపొందాలనుకున్న ఎవరికైనా.. ఆధార్ కంపల్సరీ కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -