Friday, April 26, 2024
- Advertisement -

ఇండియాలో ఇప్పటివరకు ఎన్ని వ్యాక్సిన్​ డోసులు పంపిణీ చేసారో తెలుసా..?

- Advertisement -

కరోనాతో చాలా ఎఫెక్ట్​ అయిన దేశాల్లో మనదేశం కూడా ఒకటి. మొదటి వేవ్​ కంటే.. రెండో వేవ్​ సమయంలో భారత్​లో కేసుల సంఖ్య విపరీతంగా ఉంది. ఇక ఆక్సిజన్​ అందక.. బెడ్డు దొరక్క ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా దహనాలు చేసేందుకు శ్మశానాల దగ్గర క్యూ కట్టే పరిస్థితి నెలకొన్నది. మనదేశంలోని దయనీయ పరిస్థితిపై అంతర్జాతీయ మీడియాలోనూ వార్తలు వచ్చాయి. ఇక కరోనా కట్టడికి మన ముందుకున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్​. కానీ మనదేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ సజావుగా జరగలేదన్న విమర్శలు వచ్చాయి.

అవసరమైన మేరకు కరోనా టీకాల ఉత్పత్తి జరగలేదు. దీంతో వ్యాక్సినేషన్​ ప్రక్రియ ఊపందుకోలేదు. మనదేశంలో కోవాక్జిన్​, కొవిషీల్డ్​ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి పంపిణీ సక్రమంగా జరగలేదు. దీంతో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వ్యాక్సినేషన్​ ప్రక్రియ ను ముమ్మరం చేసింది. శనివారం వరకు దేశ వ్యాప్తంగా 35 కోట్ల డోసులు వ్యాక్సిన్లు ఇచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

Also Read: కరోనాతో మెదడు కణజాలంపై ప్రభావం..!

కరోనా సెకండ్​వేవ్​ ముప్పు కూడా దేశంలో ఇప్పుడిప్పుడే తగ్గుతున్నది. ప్రస్తుతం దేశంలో 50 వేల లోపు మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 5 లక్షలకు దిగువన ఉన్నాయి. అయితే థర్డ్​వేవ్​ ముప్పు పొంచిఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో వ్యాక్సినేషన్​ ముమ్మరం చేశారు. శనివారం ఒక్కరోజు దేశవ్యాప్తంగా 57.36లక్షలకుపైగా వ్యాక్సిన్​ మోతాదులు అందించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటినుంచి ఒక్కరోజే దాదాపు ఆరు మిలియన్ల మందికి వ్యాక్సిన్ డోసులు అందించడం ఇదే తొలిసారి.

Also Read: ఫేషియల్​ స్కానర్​ కరోనాను పట్టేస్తోంది..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -