Monday, May 6, 2024
- Advertisement -

ఇంత జరగుతుంటే పవన్ ఆ పనిలో మునిగిపోతే ఎలా?!

- Advertisement -

ఒకటి కాదు.. రెండు రాష్ట్రాలకు సంబంధించిన పొలిటికెల్ డెవలప్ మెంట్ ఇది. ఒకవైపు నుంచి ఏపీ ముఖ్యమంత్రి.. మరోవైపు నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి ఒకరిపై మరొకరు నిప్పులు చెరుక్కొంటున్నారు.

పాలన విషయాలను మరిచిపోయి రాజకీయాలు చేయడంలో మునిగిపోయారు. కోట్ల రూపాయలు విసిరికొడుతూ రాజకీయాలను శాసించే ప్రయత్నం చేస్తున్నారు.

తమ బలాబలాల సంగతిని మరిచిపోయి రాజకీయాలను డబ్బుతో ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తున్నారు.

ఈ అంశం గురించి రెండురాష్ట్రాల ప్రజల్లోనూ ఆసక్తి కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఏమిటి? ఎవరు తప్పు చేశారు? తప్పు చేసిన వారికి ఎలాంటి శిక్ష పడుతుంది? ఇది రాజకీయంగా ఎంత సంచలనంగా మారతుంది? అనే అంశాలపై ప్రజల ఆసక్తి నెలకొంది. దాదాపు పది రోజుల నుంచి ప్రజల దృష్టి “ఓటుకు నోటు” డెవలప్ మెంట్స్ మీద మాత్రమే ఉంది. ఇక ఈ వ్యవహారం గురించి అన్ని రాజకీయ పార్టీలు కూడా స్పందించాయి.

తెలుగుదేశం పార్టీ వాళ్లు డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. మిగిలిన వారు మాత్రం ఈ వ్యవహారంలో నిగ్గు తేలాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎటొచ్చీ “జనసేన” మాత్రమే స్పందన లేకుండా సైలెంటుగా ఉంది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు “గబ్బర్ సింగ్ -2” తో బిజీగా ఉన్నాడు. తన సినిమా షూటింగ్ లో ఉన్న ఆయనకు ఈ పొలిటికల్ డెవలప్ మెంట్స్ గురించి అస్సలు పట్టినట్టుగా లేదు. మరి ఇలాంటి కీలకమైన అంశాల గురించి కూడా పవన్ కనీసం ట్విటర్ ద్వారానైనా స్పందించకపోతే ఆయన పెట్టిన పార్టీకి.. ఇచ్చిన నినాదాలకు పరమార్థం ఏముంది?:

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -