Saturday, April 20, 2024
- Advertisement -

ఫైజర్​కు తిరుగులేదట.. తాజా అధ్యయనం

- Advertisement -

చైనాలోని వూహాన్​ ల్యాబ్​లో పుట్టిందని అందరూ భావిస్తున్న కరోనా వైరస్​ నేడు రూపాంతరం చెందింది. జన్యుమార్పిడి చేసుకొని మరింత శక్తివంతంగా తయారై విజృంభిస్తున్నది. అయితే ఇప్పటికే కరోనా వైరస్​కు అనేక దేశాలు వ్యాక్సిన్లు రూపొందించాయి. అయితే రూపాంతరం చెందిన వైరస్​లపై ఈ వ్యాక్సిన్లు పనిచేస్తాయా? లేదా? అన్న విషయంపై సర్వత్రా ఆందోళన నెలకొన్నది.

తాము తయారుచేసిన వ్యాక్సిన్లు అన్ని వేరియంట్లపై పనిచేస్తున్నాయని ఇప్పటికే పలు కంపెనీలు చెబుతున్నాయి. మరోవైపు ప్రస్తుతం కరోనా థర్డ్​వేవ్​ విషయంలో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. ప్రజలందరికీ వ్యాక్సినేషన్​ వేయించడమే మన ముందున్న మార్గమని డబ్ల్యూహెచ్​వో సైతం హెచ్చరిస్తున్నది. మరోవైపు కొందరు నిపుణులు మాత్రం థర్డ్​వేవ్​ పై భయపడాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఫైజర్​ వ్యాక్సిన్​పై ఓ ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది.

Also Read: ‘సెకండ్​వేవ్’​ ముప్పు ఇంకా ఉంది.. కేంద్రం వార్నింగ్​

ఈ వ్యాక్సిన్​ అన్ని కొత్త తరహా వేరియంట్లపై పనిచేస్తుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఫైజర్​తో రోగనిరోధకశక్తి పెరుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ మేరకు టుక్రూ, హెల్సింకి విశ్వవిద్యాలయాల పరిశోధనలో వెల్లడైంది. శాస్త్రవేత్తలు పైజర్ వ్యాక్సిన్ వేసుకున్న మొత్తం 180 మంది ఆరోగ్య కార్యకర్తలపై పరిశోధనలు చేశారు. వారిలో రోగనిరోధక శక్తి బలంగా వచ్చినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మేరకు నేచర్​ కమ్యూనికేషన్స్​ పత్రికలో వివరాలు ప్రచురితమయ్యాయి.

చైనాలోని వూహాన్​లో పుట్టిన వైరస్​, బ్రిటన్​లోని అల్ఫా రకం, దక్షిణాఫ్రికాలో వ్యాప్తి చెందుతున్న బీటా రకం వైరస్​పై ఫైజర్​ వ్యాక్సిన్​ ప్రభావంతంగా పనిచేస్తోందని శాస్త్రవేత్త ఇల్కా జుల్కునెన్​ పేర్కొన్నారు.అయితే భారత్​లో స్ప్రెడ్ అయినట్లు భావిస్తున్న డెల్టా వేరియంట్​పై ఈ వ్యాక్సిన్​ ప్రభావంతంగా పనిచేస్తుందా? లేదా? అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు.

Also Read: ఇలా చేస్తే థర్డ్ వేవ్​ రాకపోవచ్చు.. !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -