Saturday, April 27, 2024
- Advertisement -

మూడో దశ ట్రయల్స్​ ఫలితాలు విడుదల.. కోవాగ్జిన్ సామర్థ్యం 77.8%

- Advertisement -

కరోనా కట్టడిలో భాగంగా భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్​ అనే వ్యాక్సిన్​ ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్​ పూర్తిగా దేశీయ టెక్నాలజీతో తయారైంది. మనదేశంలో ఇప్పటికే కొవిషీల్డ్​ వ్యాక్సిన్​ కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ వ్యాక్సిన్​ ను ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ తయారుచేసింది. మనదేశంలో కరోనా తీవ్రస్థాయిలో ఉండటంతో మూడు దశల ట్రయల్స్​ పూర్తికాకుండానే కోవాగ్జిన్​ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

అయితే తాజాగా కోవాగ్జిన్​ మూడో దశ ట్రయల్స్​ను భారత్ బయోటెక్​ విడుదల చేసింది. మూడో దశ ట్రయల్స్​ ప్రకారం ఈ వ్యాక్సిన్​ 77.8 శాతం సమర్థంగా పనిచేస్తుందని సంస్థ ఎండీ కృష్ణా ఎల్లా తెలిపారు.డెల్టా వేరియంట్​ విషయంలోనూ తమ వ్యాక్సిన్​ ప్రభావవంతంగా పనిచేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. డెల్టా వేరియంట్ విషయంలో ఇది 65.2 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నట్టు చెప్పారు.

మూడో దశ ట్రయల్స్ ఫలితాలను భారత్ బయోటెక్ కంపెనీ… మెడ్‌జివ్‌లో ప్రచురించింది. ఇండియాలో జరిగిన అతిపెద్ద ఎఫికసీ ట్రయల్‌లో కోవాగ్జిన్ సేఫ్ వ్యాక్సిన్ రుజువైందని కంపెనీ తెలిపింది.థర్డ్ పేజ్ లో 25,798 మందిని డోస్ -1లో, అలాగే…24,419 మందిని డోస్ -2లో పర్యవేక్షించారు. మొత్తం 146ల పాటు రోజులపాటు వారిని పరిశీలించారు.

Also Read: గర్భిణులు వ్యాక్సిన్​ వేయించుకోవచ్చా?

“వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎవరూ చనిపోలేదు. కోవిడ్ ని నిర్మూలించడంలో… ఈ వ్యాక్సిన్ బాగా పనిచేసింది. ముఖ్యంగా పెద్దవాళ్లలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నా ఇది బాగా పనిచేసింది” అని కంపెనీ తెలిపింది.

Also Read: ఆల్ఫా, డేల్టా వేరియంట్​ ఏదైనా.. కోవాగ్జిన్‌ అ సూపర్​..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -