Thursday, March 28, 2024
- Advertisement -

గర్భిణులు వ్యాక్సిన్​ వేయించుకోవచ్చా? కేంద్రం ఏం చెప్పింది?

- Advertisement -

కరోనా వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చిన మరుక్షణం నుంచి ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి తోడు సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారంతో ప్రజలు మరింత గందరగోళానికి గురవుతున్నారు. ప్రభుత్వాలు సైతం వ్యాక్సినేషన్​ విషయంలో ప్రజలకున్న అనుమానాలు నివృత్తి చేయలేకపోతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మి ప్రజలు వ్యాక్సిన్​ వేయించుకోవాలంటే భయపడుతున్నారు. ఇదిలా ఉంటే గర్భిణులు వ్యాక్సిన్​ వేయించుకోవచ్చా? అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. గర్భిణులు వ్యాక్సిన్​ తీసుకోవాలని కేంద్రం సూచించింది.

వ్యాక్సిన్​ తీసుకుంటే గర్భిణికి గానీ, కడుపులో పెరుగుతున్న బిడ్డకు కానీ ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని కేంద్ర ఆరోగ్యశాఖ క్లారిటీ ఇచ్చింది. సాధారణంగా వ్యాక్సిన్​ తీసుకుంటే కొన్ని సైడ్​ ఎఫెక్ట్స్​ వస్తున్నాయి. భుజం నొప్పి పట్టడం, స్వల్పంగా జ్వరం రావడం, ఒళ్లు నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. గర్భిణులకు కూడా అటువంటి సమస్యలే రావచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది.

గర్భిణులు వ్యాక్సిన్ వేయించుకుంటే 90 శాతం మంది రికవరీ అయ్యారని హాస్పిటల్ కి వెళ్లాల్సిన అవసరం కూడా లేకుండా సురక్షితంగా ఉన్నారని కేంద్రం పేర్కొన్నది. పుట్టబోయే బిడ్డకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండబోవని కేంద్రం పేర్కొన్నది. ఒకవేళ బిడ్డ బరువు తక్కువగా ఉంటే.. అంటే 2.5 కిలోల కంటే తక్కువ బరువుంటే వెంటనే డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచాలని సూచించింది. గర్భిణులు వ్యాక్సిన్​ తీసుకుంటే కరోనా రాకుండా ఇమ్యూనిటీని పొందగలుగుతారని కేంద్రం పేర్కొన్నది.

Also Read

కరోనా వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేయాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

లాక్ డౌన్ ఎత్తివేయడంతో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -