Friday, March 29, 2024
- Advertisement -

కుప్ప‌కూలిన తాజ్‌మ‌హ‌ల్ పిల్ల‌ర్‌…

- Advertisement -

గత రాత్రి ఆగ్రాలో కురిసిన భారీ వర్షానికి ప్రముఖ పర్యాటక క్షేత్రం తాజ్ మహల్ లో ఓ మినార్ కుప్పకూలింది. తాజ్ మహల్ ప్రవేశ ద్వారానికి ఉన్న 12 అడుగుల లోహపు పిల్లర్ (దీన్ని దర్వాజా – ఏ – రౌజాగా పిలుస్తారు) కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు మినార్ కూలిపోయి ముక్కలు ముక్కలైందని, బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత ఈ ఘటన జరిగిందని తాజ్ మహల్ నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ఏఎస్ఐ (ఆర్కలాజికల్ సొసైట్ ఆఫ్ ఇండియా) వెల్లడించింది.

చారిత్రక కట్టడాన్ని పరిరక్షించేందుకు పలు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ప్రేమకు సంకేతంగా 17వ శతాబ్ధంలో నిర్మించిన ఈ చారిత్రక కట్టడానికి పర్యాటకులు పోటెత్తుతుండటం, వాహన కాలుష్యం పెరుగుతున్న క్రమంలో తాజ్‌ మహల్‌లోకి వీక్షకులను కేవలం రోజుకు మూడు గంటలు మాత్రమే అధికారులు అనుమతిస్తున్న సంగ‌తి తెలిసిందే.

మినాల్ పైన అమర్చిన కలశం సహా అన్ని ముఖ్యమైన భాగాలనూ భద్రపరిచినట్టు తెలిపింది. కాగా, తాజ్ మహల్ పై హక్కులు తమవేనని, మొఘల్ చక్రవర్తి షాజహాన్ తమకు రాసిచ్చాడని వక్ఫ్ బోర్డు కోర్టుకు ఎక్కగా, షాజహాన్ చేసిన సంతకం చేసిన డాక్యుమెంట్లను సాక్ష్యంగా ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -