Thursday, May 2, 2024
- Advertisement -

బెంగాల్ లో తుది విడత పోలింగ్ ప్రారంభం!

- Advertisement -

బెంగాల్ లో తుదివిడత పోలింగ్ గురువారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇటీవల జరిగిన పోలింగ్ లో పలు హింసాత్మక గట్టం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో గట్టి కట్టుదిట్టాల మద్య పోలింగ్ జరుగుతుంది. బీర్భుమ్ జిల్లాలో భారీగా కేంద్ర బలగాలు మోహరించాయి. 8వ విడతలో 35 నియోజకవర్గల్లోని స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.

తుదివిడత ఎన్నికల బరిలో 283 మంది అభ్యర్థులు ఉన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. మే 2న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఓట్లు లెక్కించనున్నారు. ఉత్తర కోల్‌కతాలోని కాశీపూర్-బెల్గాచియాలోని ఒక పోలింగ్ కేంద్రంలో నటుడు, బిజెపి నాయకుడు మిథున్ చక్రవర్తి ఓటు వేశారు.

తెల్లవారుజామునుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర భారీగా ఓటర్లు క్యూకట్టారు. చివరిదశ ఓటింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఇక పశ్చిమ బెంగాల్ లో మమత వర్సెస్ ప్రధాని మోదీ మద్య ఉత్కంఠ పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

నేటి పంచాంగం, గురువారం (29-04-2021)

‘పెళ్లి సందD’ఫస్ట్ సాంగ్ రిలీజ్..

ప్రియుడి కోసం సొంత తమ్మున్ని ముక్కలుగా నరికి చంపిన సినీనటి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -