Monday, May 6, 2024
- Advertisement -

పాకిస్థాన్ కి పవర్ కష్టాలు.. రాత్రంతా కరెంట్ లేకుండానే..!

- Advertisement -
పాకిస్థాన్​ ఒక్కసారిగా అంధకారంలోకి వెళ్లింది. దేశ రాజదాని సహా పలు ప్రాంతాల్లో విద్యుత్​​ సరఫరా నిలిచిపోయింది. శనివారం అర్ధరాత్రి జరిగిన ఆకస్మిక​ పరిణామం వల్ల కరాచీ, లాహోర్​, ఇస్లామాబాద్​ వంటి పెద్ద నగరాలతో పాటు పలు ప్రాంతాలు అంధకారంలో ఉన్నాయి. విద్యుత్ వ్యవస్థ స్తంభించటానికి గల కారణమేంటని సామాజిక మాధ్యమాల్లో ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వం, అధికారులపై విమర్శలు చేశారు.

జాతీయా విద్యుత్​ సరఫరా వ్యవస్థ(ఎన్​టీడీసీ)లో తలెత్తిన లోపం​ వల్లే ఇలా జరిగిందని ఇస్లామాబాద్​ డిప్యూటీ కమిషనర్​ హంజ షఫ్​కత్​ తెలిపారు. విద్యుత్​ సరఫరాను తిరిగి పునరుద్ధరించడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు.తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందిస్తామ​ని తెలిపారు మంత్రి. విద్యుత్తు శాఖతో పాటు పలు విభాగాలు సరఫరా పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -