Monday, May 6, 2024
- Advertisement -

రామోజీ హోటల్లో జూదం

- Advertisement -

ఈనాడు గ్రూపుల అధినేత రామోజీ రావు కు చెందిన డాల్ఫిన్స్ హోటల్…. జూదగాళ్ళకు అడ్డాగా మారిందా..? కొంత కాలంగా ఆ హోటల్లో పేకాట జోరుగా సాగుతోందా ..? పోలీసు వర్గాలు కూడా అవుననడమే కాదు మంగళవారం నాడు ఆహోటల్ పై దాడి చేసి పేకాట రాయుళ్ళను అరెస్టు చేశారు కూడా.

విశాఖపట్నంలోని ఈ హోటల్ లో చాలా కాలంగా పేకాట జోరుగా సాగుతోందని, ఇతర జిల్లాల నుండి కూడా రోజూ అనేక మంది జూదగాళ్ళు వస్తున్నారని పేకాట ఆడుతున్నారనే సమాచారం కొద్ది రోజుల క్రితమే టాస్క్ఫోర్స్ కు వచ్చింది.కాని కరెక్ట్ న్యూస్ లేకుండా దాడి చేస్తే ఎక్కడ ఇబ్బందులు ఎదుక్కోవాలోనని తెలివిగా ఆచితూచి అడుగులు వేసారు.దానికి రిజల్ట్ కరెక్ట్ గా ఇపుడు దొరికింది.

టాస్క్ ఫోర్స్ సీఐ ఇలియాస్ అహ్మద్ తన బృందంతో దాల్ఫిన్ హోటల్ మీద దాడి చేశారు. రూమ్ నెం. 605లో పేకాడుతున్న ఏకంగా 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2,51,600 నగదు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి,పశ్చిమగోదావరి, హైదరాబాద్, కడప ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. దాడి జరిగిన విషయాన్ని వెంటనే విశాఖ సీపీ అమిత్ కు తెలియజేశారు.

ఆయన సూచనల మేరకు నిందితులను రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. నిందితులు నాలుగు రోజుల నుంచి అదే గదిలో పేకాట ఆడుతున్నారని ఇలియాస్ అహ్మద్ తెలిపారు. అయితే ఇంతలా జరిగిన ఈ ఆపరేషన్ విషయంలో ముందుగా పోలీస్ బాస్ లకు కరెక్ట్ గా సమాచారం ఇవ్వకుండా టాస్క్ ఫోర్స్ వారు దాడి చేశారు కాబట్టే…ఈ తంతు బయటపడిందని తెలుస్తోంది.లేదంటే దీన్నికూడా భయటకు రాకుంఆ తొక్కేసేవారని పోలీసులు చెబుతున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -