పెను సంక్షోభానికి దగర్లో ..ఏపీ !

- Advertisement -

ప్రస్తుతం ఏపీలో సి‌ఎం జగన్ పరిపాలన అర్థం కానీ ప్రశ్నలాగే ఉంది. రాష్ట్రంలో పథకాలు అంటూ, సంక్షేమలు అంటూ గతంలో ఎన్నడూ లేనివిధంగా సి‌ఎం జగన్ పరిపాలన సాగుతోందంటూ వైసీపీ వర్గం నుంచి వినిపిస్తున్నప్పటికి, ప్రజల్లో మాత్రం అర్థం కానీ జగన్ పరిపాలన అనే విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం పథకాల పేరుతో విపరీతంగా డబ్బులు పంచడం, ప్రజలకు అవసరం లేని వాటిపై ఎక్కువగా దృష్టి పెడుతూ అభివృద్దిని గాలికి వదిలేయడం, కరోనా పేరుతో నిత్యవసర వస్తువులపై విపరీతంగా రేట్లు పెంచడం వంటివి జగన్ పరిపాలనపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొనేలా చేస్తున్నాయి.

ఇదిలా ఉంచితే సంక్షేమం పేరుతో రాష్ట్ర నిధులను వృధాగా ఖర్చు చెయ్యడంతో రాష్ట్ర బడ్జెట్ తగ్గిపోయి, ద్రవ్యోల్బణం పెరిగి రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయే అవకాశం ఉందని ఎన్నో హెచ్చరికలు వస్తున్నప్పటికి, సి‌ఎం జగన్ మాత్రం రాష్ట్ర ఖజానా ను ఖర్చు చేసే విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో అప్పులు తీవ్ర స్థాయిలో శృతిమించినట్టు ఆర్బీఐ పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఋణ ఆర్థిక లోటు పరిమితులను ఏపీ దాటేసిందని, జిఎస్డిపి లో తొమ్మిది శాతానికి పైగా బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చి ఏపీ అప్పు తీసుకుంటోందని ఆర్బీఐ వివరించింది.

- Advertisement -

అయితే ఇక్కడ ఆశ్చర్య పరిచే విషయం ఏమిటంటే.. ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయిన నెల రోజుల్లోనే స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, చేబదులు తీసుకునే వంటి అవకాశాలను ఆంద్రపదేశ్ పూర్తిగా వాడేసిందట. ఈ స్థాయిలో అప్పు తీసుకుంటున్న రాష్ట్రం ఆంద్రపదేశ్ మాత్రమేనని ఏకంగా ఆర్బీఐ వెల్లడించిందంటే ఏపీలో అప్పుల చిట్టా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 2021-22 బడ్జెట్ లెక్కల ప్రకారం ఏపీలో వచ్చే ఆదాయంలో 14 శాతం తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టేందుకే వెళ్తోందని స్వయంగా ఆర్బీఐ వెల్లడించింది. మరి రాష్ట్రంలో ఈ స్థాయిలో అప్పుల చిట్టా పెరిగిపోవడం వల్ల ఊహించిన దానికంటే త్వరగానే ఏపీలో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం లేకపోలేదు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం శ్రీలంకలో ఎలాంటి పరిస్థితి నెలకొందో..అదే పరిస్థితి ఏపీలో కూడా వచ్చే అవకాశం దగ్గర్లోనే ఉందని చెప్పవచ్చు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే జగన్ పరిపాలనలో ఏపీ దివాళా తీసే అవకాశం కచ్చితంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

భారత్ కు షాక్ ఇస్తున్న,, ఆస్ట్రేలియా బొగ్గు సంక్షోభం !

“అగ్నిపథ్ “పై రచ్చ ఎందుకు ?.. అసలు కథ !

జూలై నుంచి 5జి పై.. క్లారిటీ ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -