తిరుపతిలో మరోవింత!

- Advertisement -

చిత్తూరు జిల్లా తిరుపతిలో మరో వింత ఘటన చోటు చేసుకుంది. తిరుపతి నగరంలోని శ్రీకృష్ణా నగర్‌లో ఇల్లు భమిలోకి కృంగింది. వరదల అనంతరం ఓ మూడు అంతస్తుల భవనం భూమిలోకి కృంగిపోయింది. దీంతో స్థానికులు ఆర్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే వాటర్ ట్యాంక్‌ పైకి లేవడం చూసిన ప్రజలు.. ఇప్పుడు ఇల్లు కూలకుండా కృంగి అలానే ఉండటాన్ని వింతలా భావిస్తున్నారు.

ఇలీవల కురిసిన భారీ వర్షాలు నెల్లూరు, చిత్తూరు, కడప ప్రజలకు కన్నీరు మిల్చింది. నెల్లూరు జిల్లాలో కురిసిన భారీ వర్షానికి రైతులు పంటను కోల్పోయారు. కరువు సీమలో ఒకటైన కడపలో కురిసిన భారీ వర్షానికి చరిత్రలో ఎన్నడూ నిండని రాలయ చెరువు నిండి కట్టకు గండి పడింది. దీంతో పలు గ్రామాలు జల దిగ్భందంలో చిక్కుకున్నాయి. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి.

- Advertisement -

మరో వైపు ఈ వర్షాలకు చిత్తూరు జిల్లాలో అనేక ఇళ్లు నేలకలాయి. తిరుపతి నగరంలో పలు ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. ఆ ఇళ్లు ఏప్పుడు కూలుతాయో తెలియక ప్రజలు భయాందోళనలో ఉన్నారు. మరోవైపు భూమిలోకి కృంగిన ఇంటిని అధికారులు జేసీబీ సహాయంతో కూల్చే పనిలో పడ్డారు. వర్షాల వల్ల ఇళ్లు కోల్పోయిన తమకు ప్రభుత్వం అర్థిక సహాయం అంధించాలని బాధితులు కోరుతున్నారు.

భగ్గుమంటున్న కూరగాయల ధరలు

తిరుపతిలో వింత ఘటన.. క్యూ కడుతున్న జనం

కరోనా కొత్త వేరియంట్…. కేంద్ర నిర్ణయమేంటి ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -