ఫ్రిజ్‌లతో జర జాగ్రత్త…లేక పోతే ప్రాణాలు కోల్పోతారు….

- Advertisement -

వంటింట్లోని ఎల్‌పీజీ సిలిండర్లే కాదు..ఫ్రిజ్‌లు కూడా పేలుతున్నాయి. కూల్ కూల్‌గా ఉండే ఫ్రీజ్‌లు పేలి మ‌నుషుల ప్రాణాల‌ను బ‌లిగొంటున్నాయి. తాజాగా హైదరాబాద్ శివారులోని బొంగుళూరులో ఇలాంటి ఘటనే జరిగింది. ఫ్రిజ్‌ కంప్రెజర్‌ పేలడంతో ఇంజినీరింగ్‌ విద్యార్థి దీపిక సజీవదహనమైంది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపంది.

వివ‌రాల్లోకి వెళ్లే…..నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన కొప్పుల మనోహర్-లావణ్య దంపతులు ఐదేళ్లుగా బొంగళూరులో నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె దీపిక (19) బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. గురువారం ఉదయం తల్లిదండ్రులు విధులుకు, సోదరి స్కూల్‌కు వెళ్లడంతో..ఇంట్లో గడియపెట్టుంది. మధ్యాహ్నం సమయంలో దాహం వేడయంతో నీళ్లు తాగేందుకు ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేసింది. వెంటనే కంప్రెస్సర్ పేలిపోయి మంటలు చెలరేగాయి. దీపికకు మంటలు అంటుకోవడంతో ఆమె చనిపోయింది.

- Advertisement -

షార్ట్ సర్క్యూట్ కారణంలోనే ఇంట్లోని ఎలక్ట్రానిక్ ఉపకరణాలన్నీ కాలిపోయాయి. పెద్ద శబ్ధం, మంటలు రావడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని ఇంట్లో కరెంటు సరఫరా నిలివేసి మంటలను చల్లార్చారు. దీపిక మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -