Friday, May 10, 2024
- Advertisement -

ఉప్పు నీటిలోని ఐరన్‌కు గాలి తగలడంతో ఆ ప్రాంతంలోని నీళ్లు ఎరుపు రంగులోకి మారిపోతున్నాయి

- Advertisement -
Researchers solve century-old mystery of Antarctica’s red waterfall

జ‌ల‌పాతాల‌ల్లో నీరు ప్ర‌వ‌హించ‌డం స‌ర్వ‌సాధార‌నం.. మ‌రి జ‌ల‌పాతంలో నీటికి బ‌దులు ర‌క్తం పారితే వింటేనే ఆశ్చ‌ర్య‌పోతున్నారా..మీరు విన్న‌ది నిజం. రక్తంలాంటి నీరు ప్ర‌వ‌హిస్తున్న ఆజ‌ల‌పాతాన్ని ఎర్ర‌జ‌ల‌పాతం అంటారు.

అది అంటార్కిటికాలో ఖండంలోఉంది. వంద‌సంత్స‌రాలుగా ఉన్న ర‌హ‌స్యం గుట్టు ర‌ట్ట‌య్యింది.నీరు ఎర్ర‌గా ఎందుకు ఉందో అంతుచిక్కని రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఛేదించారు.
అంటార్కిటికాలోని తెల్లటి మంచు కొండల మధ్య రక్తవర్ణంలో ఏర్పడే జలపాతానికి కారణం తెలిసింది. వంద సంవ‌త్స‌రాలుగా ప‌రిశోధ‌న‌లు చేస్తున్న శాస్త్ర‌వేత్త‌ల కృషి ఫ‌లించింది. అక్కడి నీరు రక్తంలాగా ఎర్రటి రంగులో ప్రవహించడానికి కారణం మితిమీరిన ఉప్పుతోపాటు ఐరన్‌ పాళ్లు కూడా ఎక్కువగా ఉండడంవల్లే ఈ రక్త జలపాతం ఏర్పడుతోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఉప్పు నీటిలోని ఐరన్‌కు గాలి తగలడంతో ఆ ప్రాంతంలోని నీళ్లు ఎరుపు రంగులోకి మారిపోతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్‌ అలస్కా ఫెయిర్‌బాంక్స్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ వివరాలు బయట పడ్డాయి. దీనికి సంబంధించి ఆధారాలను వారు సేకరించారు.
అంటార్కిటికాలోని టేలర్‌ గ్లేసియర్‌ కింద దాదాపు పది లక్షల సంవత్సరాల నుంచి ఉప్పు నీరు చిక్కుబడిపోయి ఉంది. రేడియో ఎకో సౌండింగ్‌ పరీక్ష ద్వారా శాస్త్రవేత్తలు ఈ నీటి జాడలను కనుగొన్నారు. మంచుదిబ్బల లోపల నీరు ప్రవహిస్తుందనేది నమ్మశక్యంకాని విషయం. అయితే నీరు గడ్డకట్టే ప్రక్రియలోనే దీనికి జవాబు ఉందని వారు చెబుతున్నారు. నీరు మంచుగా మారేముందు ఉష్ణాన్ని బయటికి వెదజల్లుతుంది. దీంతో పక్కన ఉన్న మంచుకరిగి ప్రవాహాలు ఏర్పడతాయన్నారు.
మొద‌టి సారిగా 1911 సంవత్సరంలో గ్రిఫ్ఫిత టేలర్‌ అనే భూవిజ్ఞాన శాస్త్రవేత్త ఈ జలపాతాన్ని కనుగొన్నాడు. తూర్పు అమెరికాలోని ఈ జలపాతాన్ని బ్లడ్‌ ఫాల్స్‌గా పిలుస్తున్నారు. హెచ్చు మోతాదులో ఉన్న ఉప్పు, ఐరన్‌ మూలంగా గాలి తగలగానే నీరు రక్త వర్ణంలోకి మారుతుంది. దీంతో ఈ ప్రవాహాన్ని రక్త జలపాతం(బ్లడ్‌ ఫాల్‌)గా పరిశోధకులు అభివర్ణించారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

  1. యుద్ధ‌రంగంలోకి ఉత్త‌ర‌కొరియా దిగుతోందా……?
  2. పాక్‌పై మండిప‌డ్డ‌ ఉత్త‌ర కొరియా….
  3. ట్రంప్, పుతిన్‌లు సిరియా కంటే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తీరుపైనే ఎక్కువగా చర్చించినట్లు సమాచారం….
  4. ఉత్త‌ర కొరియా దుందుడ‌కుతో అంత‌ర్జాతీయంగా ప‌రిస్థితులు ఉద్రిక్తం…..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -