Thursday, May 9, 2024
- Advertisement -

క‌మీష‌న్ల కోసం ప్రాజెక్టులు క‌ట్ట‌కండి….

- Advertisement -
Same will repart in polavaram project..?

రాజ‌ధాని నిర్మాణంలో చంద్ర‌బాబు చిత్త‌శుద్ధిని రాష్ట్ర ప్ర‌జ‌ల క‌ళ్ల‌కు క‌ట్టాయి. చిన్న‌పాటి వ‌ర్షానికే స‌చివాల‌యం, అసెంబ్లీ ప్రాంగ‌ణాలు స‌రస్సుల‌ను త‌ల‌పించాయి. ఎటూ చూసినా న‌ల్ల‌మ‌ట్టి బుర‌ద‌.. కారులో త‌ప్ప న‌డిచి ఒక్క అడుగు కూడా వేయ‌లేని దురావ‌స్థ‌.. ఆ ప‌రిస‌రాలు చూసిన వారికి అస‌లు ఇక్క‌డేనా రాజ‌ధాని క‌డుతున్న‌ది అనే సందేహం రాక‌మాన‌దు.ప్ర‌భుత్వంపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

కాంట్రాక్టు ద‌శ‌లోనే అక్ర‌మాలు జ‌రిగాయ‌ని, క‌మిష‌న్ల కోసం కాంట్రాక్టు నిబంధ‌న‌లు కూడా మార్చార‌ని ఆనాడు ప్ర‌తిప‌క్షాలు గ‌గ్గోలు పెట్టాయి. ప్ర‌తిప‌క్షాలు అభివృద్ధి నిరోధ‌కులు అనే ప‌డిక‌ట్టు పాట‌, ప‌చ్చ మీడియా వ‌త్తాసుతో బాబు వారి నోరు మూయించాడు.కాని ఇప్పుడు ప్ర‌తిప‌క్ష‌మాట‌లే నిజ‌మ‌య్యాయి. కాంట్రాక్టు క‌మీష‌న్లు,అవినీతి,వ‌ల్లే ఇదంతా జ‌రిగింద‌న‌డంలో సందేహంలేదు. దాని వ‌ల్ల ఎవ‌రికి న‌స్టం ఉండ‌దు కానీ ఇదే ఇలాఉంటె మ‌రి పోల‌వ‌రం ప్రాజెక్టుమాటేమిటి. అనుకుంటెనే భ‌యాన‌క దృష్యం క‌న‌ప‌డుతుంది.

{loadmodule mod_custom,GA1}

ఈ లెక్కన పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి? పోలవరం నిర్మిస్తున్న రాయపాటి కి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి ‘ఘనమైన చరిత్రే’ ఉంది. ఈ చరిత్ర చూసిన బాబు వీళ్ళతో పని కాదని వేరే కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు.చంద్రబాబు వారం వారం రివ్యూలు చేసి మరీ పోలవరం పనుల్ని పరిగెత్తిస్తున్నారని మనం వింటున్నాం. తాత్కాలిక సచివాలయం తాత్కాలిక అసెంబ్లీ లాగానే, వచ్చే మే కల్లా కాఫర్ డ్యామ్ (కాఫర్ డ్యాం అంటే అచ్చ తెలుగులో తాత్కాలిక ఆనకట్టే ) పూర్తిచేసి దానినుంచే పొలాలకి నీళ్ళు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ హడావిడిలో, కాంట్రాక్టర్ల వాటాల వత్తిడిలో నాణ్యత గాల్లో కలిసిపోదని గ్యారంటీ ఉందా? అవినీతి విచ్చలవిడిగా పెరిగిన ఈ ఇరవై ఏళ్లలో మనవాళ్ళు ఒక్క పెద్ద ప్రాజెక్టూ కట్టకుండా మననాయకులు మంచిపని చేశారు.
సిమెంట్లు రోడ్లు కొట్టుకుపోతే డబ్బు తప్ప పెద్ద నష్టం లేదు, అదే ప్రాజెక్టులు, ఆనకట్టలు కొట్టుకుపోతే ఎంత ప్రాణ నష్టం? అందునా పోలవరం లాంటి భారీ ప్రాజెక్ట్ కి ఏమైనా అయితే వచ్చే నష్టాన్ని ఊహిస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది.నిజంగా రైతుల మీద ప్రేమ ఉండి, ప్రాజెక్టులు కట్టాలి అనుకుంటే .. బిల్డ్ ఆపరేట్ అండ్ ట్రాన్సఫర్ BOT పద్ధతిలో కట్టించండి. హైదరాబాద్ మెట్రో రైలు ని ఈ పద్ధతిలో కడుతుండటం వల్లే, మంత్రి నారాయణ కొడుకు 200 కిమీ స్పీడ్ తో మెట్రో పిల్లర్ ని గుద్దినా కనీసం పెచ్చులు కూడా ఊడలేదు. అదే ప్రభుత్వం కట్టిస్తే పిల్లర్ పిప్పి అయిపోయేది.

{loadmodule mod_custom,GA2}

వంద‌ల సంవ‌త్స‌రాలు నిలవాల్సిన ప్రాజెక్టులలో అవినీతి చోటు చేసుకుంటె అసెంబ్లీ,స‌చివాల‌యంలాగే ఉంటుంది.దీని వ‌ల్ల ఎవ‌రికి న‌ష్టం ఉండ‌దు.కాని ప్రాజెక్టు కింద వంద‌ల గ్రామాలు ఉంటాయి …ఏదైనా ప్ర‌మాదం సంభ‌విస్తే ఉహించ‌డానికే అసాద్యం.నీటి ప్ర‌జెక్టుల‌న్న అవినీతి లేకుండా క‌ట్టండి త‌ప్ప‌….కమీషన్ల ప్రాజెక్టులు కట్టమాకండి.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -