Thursday, May 9, 2024
- Advertisement -

ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు భారీ ఊర‌ట‌..క‌నీస నిల్వ ఛార్జీలు త‌గ్గింపు

- Advertisement -

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఖాతాదారులకు భారీ ఊరట లభించింది. ఖాతాల్లో కనీస బ్యాలన్స్ లేకపోతే విధించే చార్జీలను బ్యాంకు 75 శాతం వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లోని బ్యాంకు శాఖల్లో ఈ చార్జీలు రూ.50గా ఉండగా, ఇకపై రూ.15గా అమలవుతుంది. దీనికి జీఎస్టీ అదనం.

ఏడాది క్రితమే సేవింగ్స్ ఖాతాల్లో కనీస నిల్వ‌లేక‌పోతే భారీ ఛార్జీల‌ను వ‌సూలు చేసేంది. దీంతో ఖాతాదారుల‌నుంచి వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌తో ఎస్‌బీఐ ఛార్జీల‌ను త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. కనీస నీల్వలో 75 శాతానికి పైగా లేకపోతేనే ఈ చార్జీ వర్తిస్తుంది. ఒకవేళ 50 శాతానికి కంటే తక్కువగా ఉంటే అప్పుడు చార్జీ రూ.10 మాత్రమే.

సెబీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోని శాఖల్లో గరిష్టంగా (75 శాతానికి పైగా బ్యాలన్స్ లేని సందర్భంలో) ఉన్న రూ.40 చార్జీ రూ.12, రూ.10కి తగ్గించడం జరిగింది. ఈ చార్జీలకు జీఎస్టీ అదనం. సవరించిన చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ చార్జీల తగ్గింపుతో 25 కోట్ల కస్టమర్లకు ఉపశమనం కలగనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -