Sunday, May 26, 2024
- Advertisement -

నేటి నుంచే ఎస్‌బీఐ అద‌న‌పు ఛార్జీల బాదుడు సురూ

- Advertisement -

 

SBI’s New Charges On ATM, deposites and Other Transactions From Today

ఎస్‌బీఐ బ్యాంక్ ఖాతాదారులు ఇస్ట‌మొచ్చిన‌ప్పుడు బ్యాంకులావాదేలు జ‌రుపుతున్నారా…? ఇక జాగ్ర‌త్త‌… బ్యాంకులో ఎక్కువ‌సార్లు న‌గ‌దును డిపాజిట్ చేసినా…విత్‌డ్రా చేసుకున్న చుక్కులు క‌నిపించ‌నున్నాయి.

దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ సేవల సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల విధించిన కొత్త చార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. డిజిట‌ల్ లావాదేవీల‌ను ప్రోత్స‌హించే దానిలో భాగంగా నిర్ణ‌యం తీసుకున్నారు.
మొబైల్ యాప్ ‘ఎస్బీఐ బ్యాంక్ బుడ్డీ’ వాడి నగదు విత్ డ్రా తదితర ఇతర నగదు లావాదేవీల కొత్త చార్జీలు అమలులోకి వచ్చాయి. ఇందులో భాగంగా, మొబైల్ వాలెట్ ను వాడి ఏటీఎం నుంచి డబ్బును తీసుకుంటే, ఒక్కో లావాదేవీకి రూ. 25 రూపాయలను వసూలు చేస్తారు. ఇక సాధారణ సేవింగ్స్ ఖాతాలపై మెట్రో నగరాల్లో ఎనిమిది ఉచిత ఏటీఎం లావాదేవీలు (ఎస్బీఐ ఏటీఎంలలో 5, ఇతర ఏటీఎంలలో 3) కొనసాగుతాయి. నాన్ మెట్రో ఏటీఎంలలో 10 ఉచిత లావాదేవీలకు అనుమతి ఉంటుంది.

{loadmodule mod_custom,Side Ad 1}

ఇక కొత్త వడ్డింపుల్లో భాగంగా, ఐఎంపీఎస్ లేదా ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ వాడుకుని నగదు బదిలీ చేస్తే, రూ. లక్ష వరకూ 5 రూపాయలు ప్లస్ సర్వీస్ టాక్స్, రూ. 2 లక్షల వరకూ లావాదేవీపై 15 రూపాయలు ప్లస్ సర్వీస్ టాక్స్, ఆపై రూ. 5 లక్షల వరకూ 25 రూపాయలు ప్లస్ సర్వీస్ టాక్స్ ను బ్యాంకు వసూలు చేస్తుంది. పాడైపోయిన నోట్లను మార్చుకోవాలని వెళితే, ఆ మొత్తం రూ. 5 వేల కన్నా ఎక్కువ లేదా 20 నోట్లు ఉంటే, ఒక్కో నోటుకు రూ. 2 ప్లస్ సర్వీస్ చార్జ్ ని బ్యాంకు వసూలు చేస్తుంది.
ఇక కొత్త చెక్ బుక్ కావాలంటే రూ. 30 (10 చెక్కులు), రూ. 75 (25 చెక్కులు), రూ. 150 (50 చెక్కులు)కి తోడు అదనంగా సర్వీస్ టాక్స్ చెల్లించాల్సిందే. ఇక సాధారణ సేవింగ్స్ డిపాజిట్ ఖాతా కలిగివున్న వారు ఉచిత లావాదేవీల తరువాత, ఎస్బీఐ బ్యాంకు ఏటీఎంను వాడి డబ్బు తీసుకుంటే రూ. 50 చెల్లించాల్సిందే. ఈ అద‌న‌పు ఛార్జీల‌పై ఖాతాదారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

{loadmodule mod_custom,Side Ad 2}

Related

  1. బ్యాంక్‌ల ఖాతాదారుల‌కు ఆర్బీఐ శాభ‌వార్త‌
  2. ప్లిఫ్ కార్టులో బంప‌ర్ సేల్స్
  3. ఈమె జీతం రోజుకు 2.18 లక్షలు.. అసలు ఎవరు ఈమె.. అంత జీతం ఎలా వస్తోంది..?
  4. గృహ‌రుణాల వ‌డ్డీరేట్ల‌ను త‌గ్గించిన యాక్సిస్‌బ్యాంక్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -