ఐదు గంటలపాటు కాల్పులు.. మాస్ సినిమా తలపించే సన్నివేశం..!

- Advertisement -

ఫిలిప్పీన్స్​లోని మెగుఇన్​దానావ్​ రాష్ట్రంలో పోలీసులకు, దుండగులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి సహా 13 మంది మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.

ఓ హత్య, పలు దొంగతనాల కేసులో నిందితుడుగా ఉన్న ఓ వ్యక్తి.. సుల్తాన్​ కుర్దారాత్​ పట్టణంలో ఉన్నట్లు పోలీసులకు సమాచరం అందింది. వెంటనే అతన్ని అరెస్టు చేయడానికి తెల్లవారుజామున 3గంటలకు పోలీసులు అక్కడికి వెళ్లారు. ఈ తరుణంలో వారిపై నిందితుని అనుచరులు కాల్పులకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. దాదాపు ఐదు గంటలపాటు కాల్పులు కొనసాగాయి.అనంతరం ఘటనాస్థలం నుంచి పోలీసులు పెద్ద మొత్తంలో మారణాయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News