Sunday, April 28, 2024
- Advertisement -

సభలో తనకు అన్ని పక్షాలు ఒక్కటే: స్పీకర్ కోడెల

- Advertisement -

ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీని బహిష్కరించడం చరిత్రలో ఇదే తొలిసారి అని, ఆయన అనాలోచిత నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు అన్నారు. బుధవారం ఆయన మీడియా తో మాట్లాడుతూ సభలో తనకు అన్ని పక్షాలు ఒక్కటేనన్నారు. అసెంబ్లీని వైసీపీ బహిష్కరించినా నిబంధనల ప్రకారమే నిర్వహిస్తామన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకావాలని సూచించారు.

ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావును వైసీపీ ఎమ్మెల్యేలు కలిశారు. తమ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా స్పీకర్ ను కోరారు. ఆమెను అనర్హురాలిగా ప్రకటించాలని విన్నవించారు. గతంలో పార్టీ మారిన ఎమ్యెల్యేలపై ఇచ్చిన ఫిర్యాదులపై కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

అయితే స్పీకర్ కోడెల ఎమ్మెల్యేల అనర్హత వేటుపై తన నిర్ణయం కోసం వేచి చూడకుండానే ప్రతిపక్ష నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -