Friday, May 3, 2024
- Advertisement -

బౌన్స‌ర్ బంతికి గ్రౌండ్‌లోనే కుప్ప‌కూలిన‌ లంక క్రికెట‌ర్‌…

- Advertisement -

ఆస్ట్రేలియా గడ్డపై మరోసారి బౌన్సర్ బంతి ఆటగాళ్లకు శాపంగా మారింది. గ‌తంలో బౌన్సీ పిచ్‌కు యువ క్రికెట‌ర్ ఫిలిప్ మృతి చెంద‌గా ఇప్పుడు మ‌రో శ్రీలంక క్రికెట‌ర్ గాయ‌ప‌డ్డారు. లంక ఓపెనర్ దిముత్ కరుణరత్నె (46 రిటైర్డ్ హర్ట్: 85 బంతుల్లో 5×4) బౌన్సర్‌తో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరాడు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో రెండో రోజైన శనివారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో 123/3తో నిలిచింది. అంతకముందు ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌ని 534/5తో డిక్లేర్ చేసింది. ఆసీస్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ వేసిన 31 ఓవర్‌లో నాల్గో బంతి వేగంగా కరుణరత్నేపైకి వచ్చింది. సుమారు 143 కి.మీ వేగంతో వచ్చిన బంతిని తప్పించుకునే ప్రయత్నంలో కరుణరత్నే విఫలమయ్యాడు. అది మెడ వెనుక భాగాన బలంగా తగలడంతో కరుణరత్నే విలవిల్లాడుతూ గ్రౌండ్‌లోనే చతికిలబడిపోయాడు. అనంతరం ఫిజియో ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత కరుణరత్నెని ప్రత్యేక వాహనంలో మైదానం వెలుపలికి తీసుకెళ్లి.. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -