Friday, May 10, 2024
- Advertisement -

భారీ లాభాల‌తో దూసుకెల్లిన స్టాక్ మార్కెట్‌…

- Advertisement -

వాణిజ్య వివాదాలు, అంత‌ర్జాతీయంగా మిశ్ర‌మ సంకేతాల నడుమ దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల దౌడు తీశాయి.సెన్సెక్స్‌ డబుల్‌ సెంచరీ అధిగమించడం ద్వారా ఇంట్రాడేలో 36,750 వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. చివరికి 36,719 వద్ద నిలిచింది. వెరసి 222 పాయింట్లు లాభ‌ప‌డ‌గా.. నిఫ్టీ సైతం 74 పాయింట్లు పుంజుకుని 11,085 వద్ద స్థిరపడింది. వెరసి ఆరు నెలల గరిష్టాన్ని అందుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యూపీఎల్ (14.79%), పీసీ జువెలర్స్ (14.53%), ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ (9.95%), హ్యావెల్స్ ఇండియా (9.13%), గాడ్ ఫ్రే ఫిలిప్స్ (8.43%).

టాప్ లూజర్స్:
సౌత్ ఇండియన్ బ్యాంక్ (-17.15%), ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ (-6.52%), ఎస్ఈఆర్ఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (-6.36%), హీరో మోటోకార్ప్ (-6.20%), బజాజ్ ఆటో (-5.35%).

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -