Thursday, April 18, 2024
- Advertisement -

శ్రీరెడ్డి-మహా టీవీ-సుజనాచౌదరి-ఎపి ముఖ్యనేత కుమారుడు…. మొత్తం కథ ఏంటంటే?

- Advertisement -

ప్రస్తుతం తెలుగునాట శ్రీరెడ్డి వ్యవహారం సంచలనం అయిపోయింది. కొంతమంది శ్రీరెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరు శ్రీరెడ్డిని విమర్శిస్తున్నారు. మొత్తంగా చూస్తే సోషల్ మీడియా జనాలు, మీడియా జనాలతో పాటు సామాన్యులు కూడా ఇప్పుడు తప్పకుండా శ్రీరెడ్డి గురించి చర్చించాల్సిన పరిస్థితి. ఈ స్థాయిలో చర్చించుకోవడానికి ప్రధాన కారణమైన నిన్నటి సంఘటన గురించి ముందుగా తెలుసుకుందాం.

అసలేం జరిగిందంటే……….?
లొకేషన్ః ఫిల్మ్ ఛాంబర్ ప్రాంగణం

మహా టీవీ లైవ్ వెహికల్ ముందుగా చేరుకుంది.
శ్రీరెడ్డీ, మహాన్యూస్ టీం ఫిల్మ్ ఛేంబర్‌కు చేరుకుంది.
కొంతమంది జనాలు జమయ్యారు
మహాటీవీ లైవ్ కవరేజ్ వ్యవహారాలను టెక్నీషియన్స్ సెట్ చేశారు
శ్రీరెడ్డి, స్కర్ట్ విప్పి, చున్నీ తీసి పక్కనే ఉన్న మహాన్యూస్ కొత్త మహిళా రిపోర్టర్ చేతికిచ్చింది
ఒక తలకుమాసిన రిపోర్టర్ క్రాంతి లైవ్‌లో ఆమె అంగాంగాలు కనిపిస్తుండగా ఇంటర్వ్యూ చేశాడు.
లైవ్ అయిపోయింది‌.

ఆమె బట్టలు ఆమెకిచ్చేసి.. కార్లో కూర్చుని రిపోర్టర్లందరూ హై-ఫై కొట్డుకున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని మహాటీవీ ఛానల్‌ సీఇవోగా ఉన్న మూర్తి పర్యవేక్షించారు. ఇప్పుడు జనాలందరూ కూడా మూర్తితో సహా మీడియా వాళ్ళందరినీ ఏకిపడేస్తున్నారు. శ్రీరెడ్డిని కూడా విమర్శిస్తున్నారు.

అయితే కాస్త అధ్యయనం చేస్తే తెలుస్తున్న విషయం ఏంటంటే ఈ మహాటీవీ ఓనర్ సుజనా చౌదరి. ఈ మధ్య కాలంలోనే ఈ ఛానల్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నానని సుజనా చౌదరి చెప్తున్నాడట. అయితే ఆ బాధ్యతలను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యనేత కుమారుడు తీసుకున్నాడట. ఈయనగారు గతంలో ఎన్ పేరుతో ఉండే ఇంకో ఛానల్ బాధ్యతలను కూడా తీసుకున్నాడు. ఆ సమయంలోనే ఆ ఛానల్‌లో మిడ్ నైట్ టైంలో అడల్ట్ వీడియోలు ప్లే చేసేవారు. ఇప్పుడు ఈ ఛానల్ ఎడిటర్, సీఈవోలకు కూడా స్పష్టంగా హెచ్చరికలు వెళ్ళాయట. ఏం చేస్తారో మాకు తెలియదు…….. కానీ రేటింగ్స్ మాత్రం అదిరిపోవాలని. అందుకే వాళ్ళ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నట్టు రాజకీయ నటుడు శివాజీ వినిపించిన గరుడ పురాణం అంతకు రెండు రోజులకు ముందే ఈ ఛానల్‌లో వచ్చిందండోయ్. అయితే క్రేజ్ రాలేదని చెప్పి సినిమావాడైన శివాజీతో రసరమ్యంగా మరోసారి వినిపించారు.

వాహ్…… అనిపిస్తోంది కదా……. విలువలు, నైతికత అంటూ మాట్లాడే వాళ్ళ అసలైన చర్యలు ఇవి. ఇలాంటి ప్రముఖులను…….నాటకాన్ని నడిపిస్తున్న వాళ్ళను వదిలేసి పాత్రధారులను ఆడిపోసుకుంటే ఏం ఉపయోగం?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -