ర్యాలీ పై సుప్రీంలో చర్చ.. అనుమతి వస్తుందా..?

- Advertisement -

ఢిల్లీ లో గణతంత్ర దినోత్సవం రోజున రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీకి వ్యతిరేకంగా కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. రైతుల సమస్యలపై దాఖలైన పలు పిటిషన్లను సైతం కోర్టు విచారించనుంది. గణతంత్ర వేడుకలకు విఘాతం కలిగించేందుకు ట్రాక్టర్ల కవాతు నిర్వహించాలని కొన్ని వర్గాలు భావిస్తున్నట్లు పిటిషన్ లో కేంద్రం పేర్కొంది. దేశ రాజధాని ప్రాంతంలో ఏ రూపంలోనూ నిరసనలు, ధర్నాలు, కవాతులు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరింది.

మరోవైపు సుప్రీంకోర్టు నియమిత కమిటీలోని సభ్యుల ఎంపికపై అభ్యంతరాలు తెలుపుతున్నాయి రైతు సంఘాలు. గతంలో సాగు చట్టాలకు మద్దతు పలికిన ముగ్గురు సభ్యులను తప్పించాలని కోర్టును కోరాయి. వారు కమిటీలో ఉంటే సహజ న్యాయ సూత్రాలకు విఘాతం కలిగినట్లేనని రైతు సంఘాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే విచారణలో కమిటీపై కూడా కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News